ఆరవ విడత జన్మభూమి కార్యక్రమం మొత్తం వివరాలు తెలుగులో అర్థవంతంగా
6వ విడత జన్మభూమి-మా ఊరు (JBMV) మార్గదర్శకాలు
2019, జనవరి 2 నుండి 11 వరకు
జన్మభూమి-మా ఊరు (JBMV)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్ళడానికి, వారి ఇబ్బందులను నివారించడానికి మరియు అభివృద్ధి ప్రణాళికా రచన, అమలు మరియు పర్యవేక్షణలో ప్రజలను క్రియాశీల భాగస్వాములుగా చేసే ఉద్దేశ్యంతో ఐదు విడతల జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఐదు విడతలను 2014, అక్టోబరు 2 నుండి 20 వరకు, 2015లో జూన్ 3 నుండి 7 వరకు, 2016లో జనవరి 2 నుండి 11 వరకు, 2017లో జనవరి 2 నుండి 11 మరియు 2018 జనవరి 2 నుండి 11 వరకు నిర్వహించడం జరిగింది. గ్రామ మరియు కుటుంబ స్థాయిలో (అంటే, కుటుంబ వికాసం (KV), సమాజ వికాసం(SV) కొన్ని హామీలకు చెందిన సంతృప్త విధానంలో అభివృద్ధి మరియు సంక్షేమం యొక్క ఏకీకృత ధృక్పధాన్ని ప్రధానంగా తెలియచేయడానికి మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు మరియు విజన్ 2029 క్రింద లక్ష్యాలను చేరుకోవడానికి కూడా 5వ విడత JBMVను నిర్వహించడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తూ, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు/వార్డులలో 2019, జనవరి 2 నుండి 11 వరకు 6వ విడత జన్మభూమి-మా ఊరు (JBMV) కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
6వ విడత JBMV కార్యక్రమ ప్రధాన అంశాలు – ప్రధాన లక్ష్యంగా తన ప్రజల సంక్షేమం మరియు సంతోషంతో సమ్మిళిత వృద్ది జరిగేలా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 6వ విడత JBMV కార్యక్రమ ప్రధాన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
‘వయాడక్ట్’(VIADUCT) ద్వారా అభివృద్ది మరియు వృద్ధి ధృక్పధంపై చైతన్యాన్ని కలిగించడం - ‘వయాడక్ట్’ (VIADUCT)కు విస్తరించే విజన్, వినూత్న కల్పన, జవాబుదారీతనం, డిజిటలైజేషన్, ఊబరైజేషన్, సమగ్ర మరియు సాంకేతిక పరిజ్ఞాన రూపాంతరీకరణ
CVPRASAD
0 Response to "ఆరవ విడత జన్మభూమి కార్యక్రమం మొత్తం వివరాలు తెలుగులో అర్థవంతంగా"
Post a Comment