*💠తెలంగాణలో 73.2శాతం పోలింగ్
*💠తెలంగాణలో 73.2శాతం పోలింగ్*
*🔺హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. పోలింగ్ జరిగి 24 గంటలు దాటిన తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల పోలింగ్ శాతం తుది వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.2శాతం పోలింగ్ శాతం నమోదైందని ప్రకటించారు. 2014 ఎన్నికల పోలింగ్ (69.5శాతం)తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా పోలింగ్ నమోదైనట్టు చెప్పారు. ఈసీఐకి అంతిమంగా తేల్చిన ఈ పోలింగ్ శాతాలను పంపిస్తామని తెలిపారు. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.95శాతం పోలింగ్ నమోదు కాగా.. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 48.89 శాతం పోలింగ్ నమోదైంది.ఈ ఎన్నికల్లో పురుషుల పోలింగ్ 72.54శాతం కాగా.. మహిళల పోలింగ్ 73.88గా ఉందన్నారు.*
*⭕శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా.. అర్ధరాత్రి వరకు వచ్చిన వివరాల మేరకు 69.1శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, రాత్రి 10.30గంటల తర్వాతా కొన్ని కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర ఈసీ కార్యాలయానికి నివేదికలు చేరలేదు. దీంతో పోలింగ్ శాతం మదింపుపై శనివారం రాత్రి వరకు కసరత్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికల పోలింగ్ బాగా పెరిగినట్టు ఆయన వెల్లడించారు.*
*🌀జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.*
మంచిర్యాల 78.72
ఆదిలాబాద్ 83.37
నిర్మల్ 81.22
నిజామాబాద్ 76.22
కామారెడ్డి 83.05
జగిత్యాల 77.89
పెద్దపల్లి 80.58
కరీంనగర్ 78.20
రాజన్న సిరిసిల్ల 80.49
సంగారెడ్డి 81.94
మెదక్ 88.24
సిద్దిపేట 84.26
రంగారెడ్డి 61.29
వికారాబాద్ 76.87
మేడ్చల్, మల్కాజ్‌గిరి 55.85
హైదరాబాద్ 48.89
మహబూబ్‌నగర్ 79.42
నాగర్ కర్నూలు 82.04
వనపర్తి 81.65
జోగులాంబ 82.87
నల్గొండ 86.82
సూర్యాపేట 86.63
యాదాద్రి భువనగిరి 90.95
జనగామ 87.39
మహబూబాబాద్ 89.68
వరంగల్ గ్రామీణం 89.68
వరంగల్ అర్బన్ 71.18
జయశంకర్ భూపాలపల్లి 82.31
భద్రాద్రి కొత్తగూడెం 82.46
CLICK HERE TO DOWNLOAD TELEGANA ELECTIONS CLIPPINGS
ఖమ్మం 85.99
0 Response to "*💠తెలంగాణలో 73.2శాతం పోలింగ్"
Post a Comment