డి.యస్ సి తాజా షెడ్యూలు
డి.యస్ సి తాజా షెడ్యూలు
హాల్ టికెట్ల దిగుమతి
పోస్టు వారి పరీక్షల తేదీలు
జవాబుపత్రాలు విడుదల
అభ్యంతరాలు స్వీకరణ
చివరి జవాబులపత్రం విడుదల
ఫలితాలు విడుదల
యోగ్యతా జాబితా విడుదల
ఉద్యోగానికి ఎంపికయిన అభ్యర్ధుల
జాబితా అంతర్జాలం నుండి విడుదల
మొత్తం తేదీలు తో కూడిన షెడ్యూల్ ఇది
⬛ *డిసెంబర్ 6వ తేదీ నుంచి జరగాల్సిన డిఎస్‌సి రాత పరీక్షలు అభ్యర్థుల అభ్యర్థన మేరకు మార్పు చేశామని, ఈ పరీక్షలు డిసెంబరు 24వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 30వ తేదీతో ముగుస్తాయని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.*
⬛ *తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డిఎస్‌సి రాతపరీక్షల నూతన షెడ్యూల్‌ను విడుదల చేశారు*.
⬛ *సిలబస్ చదువుకోడానికి వ్యవధి తక్కువగా ఉందని వేలాది మంది అభ్యర్థులు కోరడంతో సిఎంతో మాట్లాడి రెండు వారాల వ్యవధి పెంచామన్నారు. ఇంకా వ్యవధి కావాలని చాలామంది కోరుతున్నారని, మళ్లీ షెడ్యూల్ మార్పు చేసే అవకాశం లేదన్నారు.*
⬛ *పోస్టులు, సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూలు వివరాలను సిఎస్‌ఇ వెబ్‌సైట్‌లో నవంబర్ 30న అందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల సంఖ్యను పెంచేది లేదన్నారు.*
🛑💁🏻♂💁♀ *సవరించిన డిఎస్‌సి షెడ్యూల్ ఇదే..*
📝 *సవరించిన షెడ్యూల్ ప్రకారం*
🔷 *డిసెంబర్ 24 నుంచి జనవరి 30వ తేదీ వరకు డిఎస్‌సి రాతపరీక్షలు నిర్వహిస్తారు.*
🔷 *డిసెంబర్ 10న హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు*.
🔷 *స్కూల్ అసిస్టెంట్స్ (నాన్ లాంగ్వేజ్) పరీక్షలు డిసెంబర్ 24, 26, 27 తేదీల్లో జరగనున్నాయి*.
🔷 *స్కూల్ అసిస్టెంట్స్ (లాంగ్వేజెస్) రాతపరీక్ష డిసెంబర్ 28న నిర్వహిస్తారు.*
🔷 *పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్స్ పరీక్ష డిసెంబర్ 29న జరుగుతుంది.*
🔷 *ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పిఇటి పరీక్షలు డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో నిర్వహిస్తారు*.
🔷 *ప్రిన్సిపాల్స్, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్ టీచర్ల పోస్టులకు సంబంధించి రాతపరీక్ష జనవరి 2న జరగనుంది.*
🔷 *లాంగ్వేజ్ టీచర్స్ జనవరి 3న జరగనుంది.*
🔷 *ఎస్‌జిటికి సంబంధించి జనవరి 18 నుంచి 30వ తేదీ వరకు రాతపరీక్షలు ఉంటాయి*.
🔷 *కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు*.
🔷 *సబ్జెక్టులు, ఉద్యోగాల వారీ పరీక్షల షెడ్యూల్‌ను సిఎస్‌ఇ వెబ్‌సైట్‌లో ఈ నెల 30వ తేదీ నుంచి ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది.*
CVPRASAD
0 Response to "డి.యస్ సి తాజా షెడ్యూలు"
Post a Comment