వాట్సాప్ వాయిస్ కాల్ ఎలా రికార్డ్ చేయాలో తెలుసుకోవాలని ఉందా....





ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ కలిగిన మేసేజింగ్ యాప్ ఏదన్న ఉంది అంటే అది వాట్సాప్ మాత్రమే. ఈ రకమైనవి కొన్ని వున్నా, ఈ స్థాయిలో మాత్రం ప్రజలను రంజింపజేయలేదు.


అయితే యూజర్స్ దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు అద్భుతమైన ఫీచర్స్ ని అందిస్తూ ఉంటుంది. ఇక మనకు తెలిసిందే వాట్సాప్ ని ఉపయోగించుకొని ఫ్రీ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌ కూడా చేసుకోవచ్చని. ఇకపోతే సాధారణ ఫోన్ కాల్స్‌లో వాయిస్‌ను రికార్డ్ చేసుకొనే అవకాశం ఉంటుంది. కానీ, వాట్సప్‌లో మాత్రం వాయిస్ కాల్స్ రికార్డ్ చేయడానికి అవకాశం లేదు. అయితే ప్రస్తుత టెక్ ప్రపంచంలో వాట్సాప్ కాల్స్‌ని కూడా రికార్డ్ చేసే వెసులుబాటు కలదు. ఇపుడు వాట్సాప్‌ కాల్స్‌ ఎలా రికార్డ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1st అప్షన్: ఇది మ్యానువల్ గా ఉంటుంది. వాట్సాప్ కాల్‌ని ఉపోయోగించే ముందు మనదగ్గర వేరే మొబైల్ కూడా చేతిలో ఉండాలి. ఎందుకంటే వాట్సప్ కాల్ మాట్లాడేటప్పుడు లౌడ్ స్పీకర్ ఆన్ చేయడం ద్వారా, ఆ మాటలను మరొక ఫోన్‌లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా చేసే విధానం.

2nd అప్షన్: మీకు అభ్యంతరం లేకపోతే, 3rd పార్టీ యాప్స్ ని Play Store నుండి ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా రికార్డు చేసుకోవచ్చు. అయితే సదరు యాప్‌ లను డౌన్‌లోడ్ చేయడానికి ముందు సమీక్షలను చూసుకోవడం, రేటింగ్‌లను చెక్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ రేటింగ్స్ ఉన్న యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని వాడవచ్చు.

ఇందులో ముఖ్యమైనది ACR యాప్.. వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయడంకోసం చాలా మంది నిపుణులు ''కాల్ రికార్డర్ క్యూబ్ ఏసీఆర్ యాప్'' ని రిఫర్ చేస్తున్నారు. ఇపుడు ఈ యాప్‌ని ఉపయోగించి వాట్సాప్ కాల్స్‌ను ఎలా రికార్డ్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

1. మొదటగా ప్లే స్టోర్ కి వెళ్లి 'కాల్ రికార్డర్ క్యూబ్ ACR యాప్‌' ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

2. తరువాత ఫోన్‌లోని యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌ల లిస్టులో క్యూబ్ ACR యాప్ కనెక్టర్‌ను అనుమతించాల్సి ఉంటుంది.

3. ముఖ్యంగా బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఫీచర్‌ని డిసేబుల్ చేయాల్సి ఉంటుంది.

4. ఇక WhatsApp కాల్‌లను రికార్డ్ చేయాలనుకున్నతరువాత సదరు ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. తద్వారా మీరు వాయిస్ కాల్స్ రికార్డు చేసుకోగలరు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వాట్సాప్ వాయిస్ కాల్ ఎలా రికార్డ్ చేయాలో తెలుసుకోవాలని ఉందా...."

Post a Comment