ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా
అమరావతి: ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది.
గడిచినన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 434 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో మొత్తం 23,13,212కు పాజిటివ్ కేసులు చేరాయి.
24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 14,698 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 14,726 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 22,83,788 మంది రికవరీ అయ్యారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బౌతికదూరం పాటించాలని, కోవిడ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు
0 Response to "ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా"
Post a Comment