తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం కీలక నిర్ణయం

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం దృష్టి సారించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.



 కమిటీలో కేంద్రం తరపున హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్ నేతృత్వం వహించనున్నారు.  తెలంగాణ నుంచి రామకృష్ణారావు, ఏపీ నుంచి ఎస్.ఎస్.రావత్ సమావేశంలో పాల్గొననున్నారు. 

రెండు రాష్ట్రాల మధ్య వివాదాలపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ప్రతి నెల త్రిసభ్య కమిటీ సమావేశం అవుతుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. 

ఈనెల 17న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తొలి సమావేశం జరుగనుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం కీలక నిర్ణయం"

Post a Comment