విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సురేష్ సమీక్ష
అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మూడో విడత జగనన్న విద్యాకానుక కిట్లు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఆయన విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ అవసరమైన విద్యాకానుక కిట్లను సిద్ధం చేయాలని చెప్పారు. అందుకు అవసరమైన టెండర్ల ఖరారు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి సంబంధిత ఏజెన్సీలతో సకాలంలో వర్క్ ఆర్డర్లు జారీచేయాలని చెప్పారు
అమరావతి: విద్యాశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో జగనన్న విద్యాకానుకపై మంత్రి సురేష్ సమీక్ష జరిపారు.
పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వి సమావేశానికి హాజరయ్యారు
0 Response to "విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సురేష్ సమీక్ష"
Post a Comment