ఇంటర్‌ పరీక్షల షెడ్యూలులో మార్పు






ఈనాడు, అమరావతి: ఇంటర్‌ అర్ధసంవత్సర పరీక్షల షెడ్యూలును ఇంటర్‌ విద్యామండలి మార్చింది. ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులకు సిలబస్‌ పూర్తి కానందున వాయిదా వేయాలని ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యదర్శి శేషగిరిబాబు పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు జనవరి ఐదు వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది అర్ధ సంవత్సరం పరీక్షలను కామన్‌ ప్రశ్నపత్రంతో నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించలేకపోతే వీటినే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇంటర్‌ పరీక్షల షెడ్యూలులో మార్పు"

Post a Comment