Twitter New CEO salary: ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ జీతం ఎంతో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టిన భారతీయుడు, ముంబయికి చెందిన పరాగ్ అగర్వాల్‌కి ఓ పక్క అభినందనలు వెల్లువెత్తుంటే.. మరో పక్క నెటిజన్లు ఆయన గురించి ఆసక్తికర విషయాలను గూగుల్ చేయడం మొదలుపెట్టారు. ఆయన వయసెంత, ఎక్కడెక్కడ చదువుకున్నారు, ట్విటర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించాక జీతం ఎంత వస్తుందనే విషయాలను తెగ వెతుకుతున్నారు. తాజాగా యూఎస్ ఎస్‌ఈసీకి ఆయన సీఈవోగా నియమితులైయ్యాక పరాగ్‌కి వచ్చే వార్షిక వేతన వివరాలను వెల్లడించింది.
38ఏళ్ల పరాగ్... 2005లో ఐఐటీ-బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ బీటెక్ పూర్తి చేశాక.. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆపై 2011లో ట్విటర్ సంస్థలో చేరారు. ఇక యూస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమీషన్ వెల్లడించిన వివరాలు ప్రకారం... పరాగ్ వార్షిక వేతనం.. $ 1 మిలియన్ ( భారతదేశం కరెన్సీ ప్రకారం రూ. 7,50,81,000 / రూ. 7.50 కోట్లు) అన్నమాట. ఒక మిలియన్ డాలర్ల వార్షిక వేతనంతో పాటు 12.5 మిలియన్ డాలర్లు విలువ చేసే రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు కూడా అగర్వాల్ పొందనున్నారు. వీటితో పాటు ట్విటర్ ఉద్యోగులకు లభించే ఇతర అన్ని ప్రయోజనాలూ అగర్వాల్‌కు కూడా లభిస్తాయి
పరాగ్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు
* పరాగ్ తండ్రి అణుమంత్రిత్వ శాఖలో సీనియర్‌అధికారిగా పనిచేశారు. అమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్.
* అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌లో ఆయన పాఠశాల విద్యాభ్యాసం జరిగింది.
* పరాగ్ అగర్వాల్, ప్రముఖ గాయని శ్రేయాఘోషల్ ఇద్దరూ కలిసి చదువుకున్నారు
* 17ఏళ్ల వయసులో టర్కీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం సాధించాడు.
* 2000లో ఐఐటీ ప్రవేశపరీక్షలో 77 ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం పరాగ్‌ను ట్విటర్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య సుమారు రెండు లక్షల యాభై వేలు. ఇక పరాగ్ 1339 మందిని ఫాలో అవుతున్నారు
0 Response to "Twitter New CEO salary: ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ జీతం ఎంతో తెలుసా?"
Post a Comment