పీఆర్‌సీపై సంయమనం పాటించాలి


  • ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స సూచన
కలెక్టరేట్‌(విజయనగరం), నవంబరు 29: పీఆర్‌సీ విషయంలో సంయమనం పాటించాలని ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. 

విజయనగరంలో నిర్వహించిన జిల్లా వ్యవసాయ మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. పీఆర్‌సీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 


15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల నుంచి ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్న ప్రతిపక్షాల ఆరోపణలో నిజం లేదని, కేవలం విద్యుత్‌ చార్జీలను చెల్లించేందుకు మాత్రమే తీసుకున్నామని తెలిపారు.  



అనుమానం ఉంటే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్‌ కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులపై స్పందిస్తూ పాతవాటిని ముందుగా చెల్లిస్తామన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పీఆర్‌సీపై సంయమనం పాటించాలి"

Post a Comment