Ap News: వర్సిటీల్లో ఇబ్బందులుంటే ప్రభుత్వం నిధుల జోలికి వెళ్లదు: ఆదిమూలపు సురేశ్‌




అమరావతి: నూతన సంస్కరణలు అమలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థను సీఎం జగన్ మరింత పటిష్ట పరిచారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 11 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్లను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సీఎం చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిలో సీఎం జగన్ ప్రత్యేక ముద్ర వేశారన్నారు. చేపట్టిన ప్రతి మంచి పనికీ తెదేపా అడ్డుతగలడం దురదృష్టకరమన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను కోర్టులో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిందని.. అన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తన పరిధిలో లేదని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. వర్సిటీల్లో ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిధుల జోలికి వెళ్లదన్నారు. సీఎం జగన్‌పై తెదేపా నేతల విమర్శలు మితిమీరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర ఆరోపణలు చేయడం మానేసి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఉంటే ప్రభుత్వానికి చెప్పాలని విపక్షాలను కోరారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Ap News: వర్సిటీల్లో ఇబ్బందులుంటే ప్రభుత్వం నిధుల జోలికి వెళ్లదు: ఆదిమూలపు సురేశ్‌"

Post a Comment