WhatsApp: వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరణ
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరణ అయ్యాయి. సోమవారం రాత్రి 9 గంటల నుంచి సామాజిక మాధ్యమాలు అయిన వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం సేవలు ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిపోయాయి. దీంతో వినియోగదారులు కొన్ని గంటల పాటు ఇబ్బంది
పడ్డారు. దాదాపు 6 గంటల తర్వాత వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలను పునరుద్ధరించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సేవలు నిలిచిపోవడంతో ఈ వార్త ఒక్కసారిగా సంచలనమైంది. వీటిపై ఆధారపడ్డ కోట్ల మంది ఎందికిలా జరిగిందో అర్థంకాక హైరానా పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. పలువురు ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాలవైపు దృష్టి సారించారు. మరోవైపు ఈ సామాజిక మాధ్యమాల సేవలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయని, పునరుద్ధరణ చర్యలు చేపట్టామని ఫేస్‌బుక్ ప్రకటించింది. అంతరాయంపై క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది. భారత్‌లో దాదాపు 41 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారులున్నారు. వాట్సప్‌ను సుమారు 53 కోట్ల మంది వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రాం ఖాతాదారులు 21 కోట్ల పైనే ఉన్నారు
0 Response to "WhatsApp: వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరణ"
Post a Comment