SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. యోనో యాప్ తో ఉచితంగానే ఆ సేవలు





స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లకు ఓ శుభవార్త తెలిపింది. ఉచితంగానే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ITR ఫైలింగ్ సౌకర్యం కల్పిస్తోంది. దీంతో చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది

ఎస్‌బీఐ ఈ తరహా సేవల కోసం ట్యాక్స్2విన్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యోనో యాప్ ద్వారా సులభంగా ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. దీనికి కావాల్సిందల్లా ఆరు డాక్యుమెంట్లు మాత్రమే. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

యోనోయాప్ ద్వారా ఐటీఆర్ దాఖలుకు కావలసిన పత్రాలు..

1. పాన్ కార్డ్‌
2. ఆధార్ కార్డ్‌
3. ఫారం 16
4. పన్ను మినహాయింపు వివరాలు
5. వడ్డీ ఆదాయం సర్టిఫికేట్లు
6. పన్ను ఆదా పెట్టుబడికి సంబంధించిన ఫ్రూఫ్‌లు

ఎస్‌బీఐ కస్టమర్లు యోనోయాప్ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయాలంటే కొన్ని స్టెప్స్ అనుసరించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

* ముందుగా ఎస్‌బీఐ యోనో యాప్‌కి లాగిన్ అవ్వాలి.
* ‘షాప్స్ అండ్ ఆడర్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ‘ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్’ సెలక్ట్ చేసుకుని అక్కడ కనిపించే ‘ట్యాక్స్‌2విన్’ ఎంచుకోవాలి.
* ఇక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఆ స్టెప్స్‌ను ఫాలో అవుతూ ఐటీఆర్ సులభంగా దాఖలు చేయవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. యోనో యాప్ తో ఉచితంగానే ఆ సేవలు"

Post a Comment