సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు బాధ్యత కలెక్టర్లకు
ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు.
జిల్లాల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సచివాలయాల్లో చేరిన ఉద్యోగుల్లో అత్యధికుల సర్వీసు శనివారం నాటికి రెండేళ్లవుతోంది. వీరిలో చాలామంది శాఖాపరమైన పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులయ్యారు. తొలుత ప్రకటించిన ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారికి ప్రొబేషన్ ఖరారు చేయాలి. జిల్లా యూనిట్‌గా ఉద్యోగుల నియామక ప్రక్రియను కలెక్టర్లు నిర్వహించినందున వారే ప్రొబేషన్ ఖరారు చేస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. పలు ప్రభుత్వశాఖల ఉద్యోగులు సచివాలయాల్లో ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్లు చర్చించాక ప్రొబేషన్ ఖరారుపై నిర్ణయం తీసుకుంటారని సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు
0 Response to "సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు బాధ్యత కలెక్టర్లకు"
Post a Comment