ఏపీలో 9,160 స్కూళ్లలో.. ఒక్కొక్కరే మాస్టార్లు!

🔳ఏపీలో 9,160 స్కూళ్లలో.. ఒక్కొక్కరే మాస్టార్లు!

అందులో 91% గ్రామాల్లోనే
దేశంలో ఆంధ్రప్రదేశ్‌ది నాలుగో స్థానం

ఇంకా 27,398 మంది టీచర్ల అవసరం
యునెస్కో నివేదిక వెల్లడి

ఏపీలో 9,160 స్కూళ్లలో.. ఒక్కొక్కరే మాస్టార్లు!

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని 9,160 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నట్లు ‘నో టీచర్‌ నో క్లాస్‌... స్టేట్‌ ఆఫ్‌ ది ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ ఫర్‌ ఇండియా-2021’ పేరుతో యునెస్కో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని ఏకోపాధ్యాయ పాఠశాలలు 91% పాఠశాలలు గ్రామాల్లోనే ఉన్నట్లు తెలిపింది. మొత్తం 63,621 స్కూళ్లలో 14.4% ఇలా ఒకే ఉపాధ్యాయుడితో సాగుతున్నట్లు వెల్లడించింది. అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న రాష్ట్రాల జాబితాలో అరుణాచల్‌ప్రదేశ్‌ (18.22%), గోవా (16.08%), తెలంగాణ (15.71%) రాష్ట్రాల తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.

ఏపీలో 9,160 స్కూళ్లలో.. ఒక్కొక్కరే మాస్టార్లు!
* రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 8.39%, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10%, మాధ్యమిక పాఠశాలల్లో 8.32%, మాధ్యమికోన్నత పాఠశాలల్లో 2.28% టీచర్ల అర్హతలు ప్రమాణాల కంటే తక్కువ ఉన్నాయి.


* దక్షిణాదిలో తాగునీటి సౌకర్యం తక్కువ (77%)గా ఉన్న స్కూళ్లు ఏపీలోనే ఉన్నాయి.

* పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి.

* ఏపీలోని టీచర్లు వారానికి నాలుగైదు గంటలు బోధనేతర పనులకు కేటాయించాల్సి వస్తోంది.

* రాష్ట్రంలోని మహిళా టీచర్లు పని ఒత్తిడి కారణంగా పని-జీవితం మధ్య అసమతౌల్యం ఎదుర్కొంటున్నారు. విపరీతమైన పనిభారం, పని చేసేచోట పరిస్థితులు బాగా లేకపోవడం, సుదీర్ఘమైన పనిగంటల కారణంగా టీచర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.


* వాట్సప్‌, రేడియో, టీవీ, రికార్డెడ్‌ పాఠాలు, ప్రింట్‌ మెటీరియల్‌ను అందుబాటులోకి తెచ్చి పిల్లలను ఆన్‌లైన్‌ పాఠాలకు ఆకర్షితులయ్యేలా చేయడంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్ల కంటే మెరుగ్గా ఉన్నాయి.

* దేశవ్యాప్తంగా టీచర్ల లభ్యత పెరిగినా టీచర్లు-విద్యార్థుల నిష్పత్తి మాధ్యమిక పాఠశాలల్లో ఆశాజనకంగా లేదు. సంగీతం, ఆర్ట్‌, పీఈటీల సమాచారం ఎక్కడా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,10,971 ఉండగా, అందులో 89% గ్రామాల్లోనే ఉన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో 9,160 స్కూళ్లలో.. ఒక్కొక్కరే మాస్టార్లు!"

Post a Comment