ఏపీ కేబినెట్ భేటీ నేడుSep


అమరావతి: ఏపీ మంత్రివర్గం సమావేశం శుక్రవారం జరగనుంది. సచివాలయంలో ఒకటో బ్లాక్ కేబినెట్ హాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం సమావేశం కానుంది. మొత్తం 40 అంశాలు ఎజెండాగా కేబినెట్ చర్చించనుంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశం తేదీలు, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలతో
ఏర్పాట్లపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మంత్రివర్గ సమావేశానికి ఇద్దరు మంత్రులు ఆనారోగ్య కారణంగా హాజరుకాలేకపోతున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ యాదవ్‌లు గౌర్హాజరయ్యే అవకాశముంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ కేబినెట్ భేటీ నేడుSep"

Post a Comment