By Election: హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది
దిల్లీ: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు పార్లమెంట్, 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్, బద్వేలు శాసనసభ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. హుజురాబాద్, బద్వేలులో అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు..
CLICK HERE TO DOWNLOAD SCHEDULE
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీలోని బద్వేలులో వైకాపా ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మృతిచెందడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో ఈసీ అక్కడ కూడా ఉప ఎన్నిక నిర్వహించనుంది.
ముఖ్యమైన తేదీలివే
ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 1
నామినేషన్ల స్వీకరణ గడువు: అక్టోబర్ 8
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 11
నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 13
ఎన్నికల పోలింగ్: అక్టోబర్ 30
ఓట్ల లెక్కింపు: నవంబర్ 2
AP News: బద్వేలు ఉప ఎన్నిక.. వైకాపా, తెదేపా అభ్యర్థులు వీరే.?
బద్వేలు: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడ అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ పేరును వైకాపా అధిష్ఠానం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. మరోవైపు తెదేపా అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ పేరును ఆ పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది. బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వైకాపా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ శాసనసభ స్థానానికి అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది
0 Response to "By Election: హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది"
Post a Comment