త్వరలో కొత్త జిల్లాల ఏర్పాటు!
బ్రాహ్మణ కార్పొరేషన్‌పై విమర్శలు తగదు: డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
గుంటూరు, సెప్టెంబరు 26: వచ్చే సాధారణ బడ్జెట్ లోపే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనగణన కొనసాగుతుండడంతో కొత్త జిల్లాల ఏర్పాటులో కొంత జాప్యం జరుగుతోందని తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో విలీనం చేయటంపై ఎవరూ ఆందోళన చెందవద్దని, పథకాల నిర్వహణ మాత్రమే బీసీ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని స్పష్టంచేశారు. కార్పొరేషన్‌పై రాజకీయపరమైన విమర్శలు చేయటం తగదన్నారు
0 Response to "త్వరలో కొత్త జిల్లాల ఏర్పాటు!"
Post a Comment