నిర్దిష్ట గడువులోగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ఆ దిశగా కేంద్రం సన్నాహాలు
దిల్లీ: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ విభాగాల్లో బ్యాక్లాగ్ పోస్టులను సుదీర్ఘ కాలం పాటు ఖాళీగా ఉంచకుండా త్వరితగతిన భర్తీ చేయడానికి కేంద్రం సమాయత్తమవుతోంది. ఇందుకోసం త్వరలోనే నిర్దిష్ట గడువును ఖరారు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖలకు మార్గదర్శకాలు జారీ కానున్నట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంతోపాటు రాష్ట్రాల్లోనూ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను అదే మంత్రిత్వ శాఖకు అప్పగించనున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలోనే సుమారు 42 వేల బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నట్లు అంచనా. అందులో దాదాపు 15 వేల పోస్టులు ఓబీసీ కేటగిరీకి చెందినవి
0 Response to "నిర్దిష్ట గడువులోగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ఆ దిశగా కేంద్రం సన్నాహాలు"
Post a Comment