ఉద్యోగికి కరోనా సోకితే.. 28 రోజుల ‘వేతన’ సెలవులు


యూపీలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నింటికీ వర్తింపు


లఖ్‌నవూ, ఏప్రిల్‌ 20 : కరోనా సోకిన ఉద్యోగులు విధులకు హాజరు కాకుంటే.. 



వచ్చే వేతనం కాస్తా ఆగిపోతుంది. ఇంటి ఖర్చులు వెళ్లదీయడమూ కష్టతరంగా మారిపోతుంది. కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో వారికి అండగా 



నిలిచేందుకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అయితే.. 28 రోజుల పాటు వేతన సెలవులు (పెయిడ్‌ లీవ్స్‌) ఇస్తామని ప్రకటించింది. 



కనీసం 10 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే అన్ని దుకాణాలు, పని ప్రదేశాలు, సంస్థలు ఈ నిబంధనను అమలు చేయాల్సిందేనంటూ యూపీ సర్కారు ఆదేశాలను జారీచేసింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఉద్యోగికి కరోనా సోకితే.. 28 రోజుల ‘వేతన’ సెలవులు"

Post a Comment