వారు ఎన్నికల విధులకు వద్దు!
ఏపీ జేఏసీ’ వినతిపై ఎస్‌ఈసీ ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): అనారోగ్య సమస్యలతో బాధపడతున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని జనవరి 30న ఎన్నికల కమిషన్‌ను ఏపీ జేఏసీ అమరావతి కోరింది. జేఏసీ ప్రతినిధులు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ స్పందించారు. గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, 50 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక జబ్బుల(క్యాన్సర్, గుండె, కిడ్నీ)తో బాధపడుతున్న వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె. కన్నబాబు ఆదేశాలు ఇచ్చారు. దీనిలో ఏపీజేఏసీ అమరావతి ఇచ్చిన వినతిపత్రాన్ని రిఫరెన్స్‌గా పేర్కొన్నారు
0 Response to "వారు ఎన్నికల విధులకు వద్దు!"
Post a Comment