🌼జూన్‌ 7 నుంచి పదోతరగతి పరీక్షలు* జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

🌳

*🌼జూన్‌ 7 నుంచి పదోతరగతి పరీక్షలు*

జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి



పదో తరగతి పరీక్షల్ని జూన్‌ 7 నుంచి 16 వరకు నిర్వహించనున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మే 3 నుంచి 10 వరకు వార్షిక పరీక్షలు జరపనున్నామని వెల్లడించారు.

ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల్ని జూన్‌ 7 నుంచి 16 వరకు నిర్వహించనున్నామని, ఈసారి ఏడు పేపర్లు ఉంటాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సైన్స్‌ మినహా మిగిలిన ఐదు పరీక్షలు ఒక్కొక్కటి 100 మార్కులకు, సైన్స్‌లో భౌతిక, జీవశాస్త్రాల పరీక్షలు వేర్వేరుగా 50 మార్కులు చొప్పున ఉంటాయని పేర్కొన్నారు. 2020-21 సంవత్సరానికి ఖరారైన విద్యా వార్షిక ప్రణాళిక, పరీక్షల వివరాలను సచివాలయంలో బుధవారం ఆయన వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులకు జూన్‌ 5 వరకు తరగతులు నిర్వహించనున్నారు. 35 శాతం సిలబస్‌ తగ్గించి, పాఠ్యాంశాలు బోధించేలా ప్రణాళిక అమలు చేస్తారు.

* ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మే 3 నుంచి 10 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.

* వీరికి చివరి పనిదినం మే 15గా నిర్ణయించారు.

* మే 16 నుంచి జూన్‌ 30 వరకు సెలవులు ఇస్తారు.

* ఈ సెలవుదినాల్లో ఒంటిపూట బడులు నిర్వహించడంపైనా ఆలోచన చేస్తున్నారు.

* కొత్త విద్యా సంవత్సరం జులై 1 నుంచి మొదలవుతుంది.
ఆదివారాల్లోనూ ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

* ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 5 నుంచి మొదలుకానుండగా, పరీక్ష ఫీజును పెంచకుండా గత ఏడాది ఉన్నదాన్నే ఖరారు చేశారు. ఫీజు రూ.490, దరఖాస్తుకు రూ.10, ప్రాక్టికల్స్‌కు రూ.190గా నిర్ణయించారు.

* ఇంటర్మీడియట్‌ సిలబస్‌లో 30 శాతం తగ్గించారు.



* ప్రాక్టికల్స్‌ను మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 24 వరకు జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఆదివారాలూ  ప్రాక్టికల్స్‌ ఉంటాయి.

* కరోనాతో గత ఏడాది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకపోవడంతో, ఈసారి ఆ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు అవకాశం ఇచ్చారు.

* గత ఏడాది మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులంతా ఈ పరీక్షలు రాయవచ్చు.

* సప్లిమెంటరీ పరీక్షలు లేకపోవడంతో... పాస్‌కాని విద్యార్థులను 35 మార్కులతో ఉత్తీర్ణులు చేశారు. ఇలా మార్కులు పొంది, ప్రస్తుతం రెండో ఏడాది పూర్తయిన విద్యార్థులు.. ఆయా సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకునే వీలు కల్పించారు.

* ఇంటర్‌, పదో తరగతికి ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధాన పరీక్షల ఫలితాలు వచ్చిన నెలరోజుల్లో ఇవి ఉంటాయి.
ఈ సారి ఏడు పేపర్లే
పదో తరగతి పరీక్షల్లో భారీ మార్పులు తీసుకొచ్చారు. 2019-2020 విద్యా సంవత్సరం మొదట్లో అంతర్గత మార్కులు, బిట్‌ పేపర్‌ తొలగించినా కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. ఈ రెండు మార్పులతోపాటు ఈసారి 11 పరీక్షలను ఏడుకు కుదించారు. సామాన్యశాస్త్రానికి రెండు పరీక్షలు కాగా మిగతా వాటికి ఒక్కో పరీక్షే ఉంటుంది. సంస్కరణలు తీసుకొచ్చాక వచ్చే జూన్‌ 7 నుంచి నిర్వహించే పరీక్షలే మొదటివి కానున్నాయి.
పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఏడు ప్రశ్నపత్రాలే ఉంటాయి. గతంలో హిందీకి ఒకటి, మిగతా ఐదు సబ్జెక్టులకు 50 మార్కుల చొప్పున 10 పరీక్షలు ఉండేవి. ఈ ఏడాది ఏడు పరీక్షలే నిర్వహించనున్నారు. కొత్త విధానంలో ప్రశ్నపత్రాల్లో ఉండే ప్రశ్నల సంఖ్యను పెంచకుండా మార్కులను పెంచనున్నారు. పరీక్ష వ్యవధి అరగంట పెరగనుంది. వంద మార్కుల పరీక్షలకు 3.15 గంటలు సమయం ఉంటుంది. భౌతిక, రసాయన శాస్త్రం కలిపి 50 మార్కులు, జీవశాస్త్రం 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. వీటికి ఒక్కో పరీక్షకు 2.45 గంటలు సమయం ఇస్తారు.

* విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని చదువు కొనేందుకు 10 నిమిషాలు, చివర్లో జవాబులను సరి చూసుకునేందుకు మరో ఐదు నిమిషాలు ఇస్తూ పరీక్ష సమయంలో 15 నిమిషాలు అదనంగా కేటాయించారు.

* బిట్‌ పేపర్‌ ఉండదు. ప్రశ్నపత్రంలోనే సూక్ష్మ లఘు ప్రశ్నలు ఇస్తారు. వంద మార్కుల పేపర్లలో ఒక్కోదానికి ఒక మార్కు చొప్పున 12 ప్రశ్నలు ఇవ్వగా.. 50 మార్కుల ప్రశ్నపత్రంలో ఒక మార్కును అర్ధ మార్కుకు తగ్గిస్తారు. ఈ ప్రశ్నలు ఒక పదంలో సమాధానం రాసేవిగా ఉంటాయి.

* విద్యార్థులు సమాధానాలను రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు అందులోనే రాయాలి. ప్రత్యేకంగా అదనపు సమాధాన పత్రాలు ఉండవు. అదనపు షీట్లను ఇవ్వడంతో విద్యార్థులు నంబర్లు సరిగా వేయకపోవడం, పేపర్లను సరిగా కట్టకపోవడం లాంటి సమస్యలు వస్తున్నందున బుక్‌లెట్‌    విధానాన్ని తీసుకొస్తున్నారు.*

🍁🍃🍁🍃🍁🍃

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "🌼జూన్‌ 7 నుంచి పదోతరగతి పరీక్షలు* జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి"

Post a Comment