ఈ- సర్వీస్ రిజిస్టర్* *(e-SR
*🌸ఈ- సర్వీస్ రిజిస్టర్* *(e-SR)*
ఉద్యోగి తన సర్వీసుకాలంలో చేసిన సేవలను నమోదు
చేసేందుకు ఉద్దేశించినదే సర్వీసు రిజిష్టరు. ఉద్యోగ జీవితంప్రారంభమైన నాటి నుండి పదవీ విరమణ పొందేవరకు అతనికి చెల్లించిన వేతనాలు, రాయితీలు, అవార్డులతో బాటు వినియోగించిన
సెలవులు, పొందిన శిక్షల వివరాల సమాహారమది.
ప్రతి ఉద్యోగికి ఉద్యోగంలో చేరిన నాటి నుండి అతని ఉద్యోగి ప్రధాన కార్యాలయంలో సర్వీసు రిజిష్టరు నిర్వహించ బడుతుంది. అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేంద్రీకృతం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా దృష్ట్యా ఉద్యోగులకు ఆన్లైన్లో సర్వీస్ రిజిస్టర్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిఓ ఎంఎస్ నం. 99 ఆర్థిక, తేది. 27.06.2018 ద్వారా
ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిష్టరు ను ప్రారంభించా లని ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం ఈ-సర్వీసు
రిజిష్టరును 12భాగాలుగా విభజించారు.
1. వ్యక్తిగత వివరాలు, 2. సర్టిఫికెట్లు, 3. ఉద్యోగ వివరాలు, 4. పొందిన వేతనాల వివరాలు, 5. సెలవుల వివరాలు, 6. ఎల్టిసి వివరాలు, 7. తీసుకున్న అడ్వాన్సుల వివరాలు, 8. గ్రూపు ఇన్స్యూరెన్సు స్కీమ్ వివరాలు, 9. సర్వీసు వెరిఫికేషన్ వివరాలు,
10. డిపార్టుమెంటు టెస్టులు మరియు ట్రైనింగ్ ల వివరాలు,
11. పొందిన రాయితీలు మరియు శిక్షల వివరాలు,
12. పెన్షన్ ప్రపోజల్సు.
31.08.2018 నాటికే ఉద్యోగులు పార్ట్-1లోని వివరాలను ఆన్లైన్ చేయాలని నిర్ణయించి నప్పటికీ, పలు సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఏప్రిల్ 1 నాటికి ఉద్యోగులు అందరూ పార్ట్-1లోని అంశాలను ఆన్లైన్ చేయాలని నిర్ణయించారు.
వీటిని పరిశీలించి ఆయా డ్రాయింగు అధికారులు ధృవీకరించవలసి
వుంటుంది.
*🌸వ్యక్తిగత వివరాలు*
ట్రెజరీ "DDO Request" open చేయగానే ఉద్యోగులు వారి వివరాలు అప్డేట్ చేసుకోవాలనే సూచనలు కన్పిస్తాయి. వాటి
క్రిందగల అప్లికేషన్ క్లిక్ చేయగానే “ఎంప్లాయీస్ పర్సనల్ డిటెయిల్స్
అడేషన్ కనిపిస్తుంది. లాగిన్లో CFMS ID, మొబైల్ నంబర్లను
నమోదు చేసి Generate OTPను క్లిక్ చేయాలి. మొబైల్ కు వచ్చిన
OTP నెంబరును నమోదు చేసి Proceed క్లిక్ చేయాలి. CFMS
డేటాలో నమోదు అయిన మొబైల్ నంబరును మాత్రమే వినియోగిం
చాలి. అయితే ఒక పర్యాయం ఫోన్ నంబరు మార్చుకు నేందుకు
అవకాశముంది.
"వ్యక్తిగత విరాల లాగిన్ అవ్వగానే దానిలో (1)
Personal detials (2) View details కన్పిస్తాయి.
పర్సనల్ డిటెయిల్స్ లో (1) Personal details (2) Photo upload details (3) Family details (4) Educa-
tion details (5) Addrss details (6) Home Town
|derials (7) Bank Account details పేజీలు ఉంటాయి.
*
*🌸1. Personal detials* :
వ్యక్తిగత వివరాల పేజీ తెరవగానే లోపల అప్పటికే నమోదు అయిన (1) పేరు, ఇంటి పేరు (2) పు/స్త్రీ (3) సర్వీసు (4) పోస్టు కేటగిరీ (5) ఉద్యోగి ట్రెజరీ
బడి (6) ఉద్యోగి CFMS ID (7) ఉద్యోగి ఆధార్ నెంబరు (8)వైవాహిక స్థితి (9) కులం తదితర వివరాలు వుంటాయి. వీటిలోతప్పులు ఏవైనా ఉంటే సవరించుకునే అవకాశముంది. అనగా
పేరులో స్పెల్లింగ్లు, పుట్టిన తేదీ వంటి తప్పులు కూడా సవరించుకోవచ్చు. SC, ST, BC కులముల వారు తప్పనిసరి Caste
Certificate అప్లోడ్ చేయవలసివుంటుంది .STU తరువాత ఉద్యోగంలో
చేరిన తేదీ, పదవీ విరమణ తేదీ, డిపార్టుమెంట్ (ESE02. స్కూల్ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్), ప్రస్తుత సర్వీసు రూల్సు - క్లాసు-పోస్టు
కేటగిరీ - పనిచేస్తున్న పోస్టు, DDO కోడ్, ఎంప్లాయి గ్రూపు, వర్కింగ్
స్టేటస్ తదితర వివరాలు అన్ని పూర్తిచేయాలి.
దాని తర్వాత పుట్టిన స్థలం వివరాలు, సర్వీసు రిజిస్టరులోనమోదైన పుట్టుమచ్చల వివరాలు నమోదు చేయాలి. వీటితోబాటు
అంగవైకల్యం ఉంటే దాని వివరాలు నమోదుచేసి సర్టిఫికెట్ అప్లోడ్
చేయాలి. తర్వాత ఎస్ ఎస్ సి సర్టిఫికెట్ కూడా అప్ లోడ్ చేయాలి.
*🌸2.Photo upload details*:
రెండవ పేజీలో (1) ప్రస్తుత ఫోటో (2) ఉద్యోగంలో చేరిన
నాటి ఫోటో (లభ్యమైతే) (3) రిటైరుమెంట్ నాటికి 12 నెలల ముందునాటి ఫోటో (4) రిటైర్మెంటకు 12 నెలలముందు జీవిత
భాగస్వామితో ఫోటో అప్లోడ్ చేయాలి.
3,4 అంశాలలోని ఫోటోలు 1 సం||లో రిటైర్ కానున్న వారు మాత్రమే అప్లోడ్ చేయాలి.
*🌸3.Family details* :
దీనిలో స్పౌజ్ తో బాటు కుమారులు, కుమార్తెలు, ఆధారిత తల్లిదండ్రులు, ఆధారిత కుటుంబ సభ్యుల వివరాలు అనగా (1) జీవించిఉన్నారా? లేదా? (2) పు/స్త్రీ (3) UID/ఆధార్ నం. (4) పుట్టినతేదీ (5) మొబైల్ నంబరు (6) వివాహమైన తేదీ (7) ఉద్యోగ స్థితి
వంటి వివరాలు నమోదు చేయాలి.
ప్రస్తుతం జీవించి వున్నవారేగాక, మరణించిన వారి వివరాలుకూడా నమోదు చేయాలి. అలాగే వివాహమైన బిడ్డల వివరాలుకూడా నమోదు చేయాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాలు
ఉద్యోగిపై ఆధారపడిన వారి వివరాలు మాత్రమే నమోదు చేయాలి.
*🌸4. Education details* :
ఈ పేజీలో ఉద్యోగి విద్యార్హతలుకు సంబంధించిన వివరాలు
(1) విద్యార్హత (2) బ్రాంచ్ లేదా స్ట్రీమ్ పేరు (3) పాసైన తేదీ (చదివిన స్కూల్ / కాలేజీ / యూనివర్శిటీ (5) చదివిన దేశం -
రాష్ట్రం - జిల్లా - మండలం నమోదు చేయాలి.
చదవడం, వ్రాయడం మొదలుకొని 7వ తరగతి - 10వ తరగతి
- ఇంటర్మీడియేట్ - డిగ్రీ - పిజి లతో బాటు టెక్నికల్ డిగ్రీలు,M.Phil, Ph.D వగైరా అన్ని విద్యార్హతలు నమోదు చేయాలి. ప్రతీ
విద్యార్హతకు సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి.
*🌸5. Addres details* :
ప్రస్తుత, పర్మనెంట్, అడ్రస్ వివరాలు నమోదు చేయాలి.
*🌸6. Home Town* :
ఉద్యోగులు పుట్టిన / స్వంత ఊరు వివరాలు నమోదు చేయాలి.
ఈ వివరాలు LTCకి పరిగణించబడతాయి. కావున పూర్తి ఆధారాలు
కలిగివుండాలి.
*🌸7. Bank Account details* :
ప్రస్తుతం మనం వేతనాలు పొందుతున్న (1) బ్యాంకు అక్కౌంట్ నంబర్ (2) బ్యాంకు పేరు (3) బ్రాంచి పేరు (4) IFSC కోడ్
వివరాలు నమోదు చేసి బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి అప్లోడ్
చేయాలి. తరువాత PAN నంబరు, ZPPF/GPF నంబరు, CPSవారికి PRAN నంబరు, APGLI నంబరు మొదలగు వివరాలునమోదు చేసి వాటికి సంబంధించిన కార్డులు లేదా స్లిప్పులు అప్లోడ్ చేయాలి. వివరాలు నమోదు చేసేటప్పుడు ఏ పేజీకి ఆ పేజీ సేవ్ చేయాలి.ఈ విధంగా వివరాలు నమోదు చేసిన తర్వాత View details లోకివెళితే అక్కడ నమోదు చేసిన వివరాలు మొత్తం కన్పిస్తాయి. వాటినిసరి చూసుకోవాలి. ఏవైనా తప్పులుంటే సవరించుకోవచ్చు. ఈ
విధంగా అన్ని వివరాలు కరెక్టుగా ఉన్నాయని నిర్ధారించుకున్న
తరువాత బయోమెట్రిక్ డివైజ్ ద్వారా సబ్ మిట్ చేయాలి. సబ్ మిట్
చేయగానే ఈ వివరాలు అన్ని DDO CFMS IDకు వెళతాయి. DDO లు తమ పరిధిలోని employee వివరాలు సరి చూసి ఆదరైజ్ చేస్తారు.
*🌷E-SR నందు మనం Upload చేయవలసినకొన్ని సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లు🌷*
*1) Caste certificate (For BC/SC/ST only)*
*(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB*
*2) PH Certificate*
*(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB*
*3)SSC certificate/SR extract with moles*
*(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB*
*4)Photo (Present)*
*(JPG/JPEG) Below-256KB*
*5) Photo (at the time of appointment/First page of SR)*
*(JPG/JPEG) Below-256KB*
*6) Local certificate/SR local status extract*
*(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB*
*7)SSC AND ALL ACADEMIC CERTIFICATE*
*EACH ONE (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB*
*8)Bank pass book first page*
*(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB*
*9)PAN CARD*
*(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB*
*10)PRAN/ZPPF/PF*
*(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB*
*PF slip can produce as document*
*11)APGLI BOND*
*(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB*
*12) Properties(Moveable/immovable)*
*(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB*
*13) Departmental tests*
-
0 Response to "ఈ- సర్వీస్ రిజిస్టర్* *(e-SR"
Post a Comment