‘అమ్మ ఒడి’ వివరాలు సరిచూసుకోండి
తల్లులకు పాఠశాల విద్యాశాఖ సూచన
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం-2020-21కు సంబంధించి విద్యార్థుల తల్లులు తమ వివరాలను వెబ్ పోర్టల్‌లో సరిచూసుకోవాలని పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు సూచించారు. గురువారం ఆయన తన
కార్యాలయంలో ‘అమ్మ ఒడి’ పథకం అమలు తీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పథకం విజయవంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అలాగే, ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు.. అర్హులైన తల్లులు లేదా సంరక్షకులు తమ బ్యాంకు ఖాతా నంబరు, ఐఎ్‌ఫఎస్సీ కోడ్, రైస్ కార్డు నంబరు వంటి వివరాలను ‘అమ్మ ఒడి’ వెబ్ పోర్టల్‌లో సరిచూసుకోవాలని కోరారు. ఆ వివరాల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ణి సంప్రదించి సరిదిద్దుకోవాలని సూచించారు. ఇంకా అభ్యంతరాలుంటే ‘అమ్మ ఒడి’ వెబ్ పోర్టల్‌లో సరిచేసుకోవాలన్నారు.
ఇళ్ల నిర్మాణ సామగ్రి కొనుగోలుకు కమిటీలు
ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నిర్మాణ సామగ్రి కొనుగోళ్లకు జిల్లాల్లో వెంటనే కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేసి, టెండర్లు పిలిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని హౌసింగ్ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలపై గురువారం జాయింట్ కలెక్టర్లు, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కమిటీల్లో జిల్లా ఇసుక అధికారి, డ్వామా పీడీలు కచ్చితంగా సభ్యులుగా ఉండాలని స్పష్టంచేశారు
0 Response to "‘అమ్మ ఒడి’ వివరాలు సరిచూసుకోండి"
Post a Comment