ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

AP Government: ఏపీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న, పూర్తి చేసిన విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఆయా విద్యార్ధులకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), ప్రముఖ శిక్షణా సంస్థ ఎక్స్ఎల్ఆర్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.




దీని ప్రకారం డేటా అనాలసిస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బిగ్ డేటా లాంటి ఎమర్జింగ్ కోర్సుల్లో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులు, పూర్తి చేసిన స్టూడెంట్స్‌తో పాటు ప్రొఫెసర్లకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు


ఇప్పటికే ఏపీఎస్‌ఎస్‌డీసీ, ఎక్స్ఎల్ఆర్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లోని 2500 మంది ప్రొఫెసర్లకు డేటా సైన్స్ కోర్సుపై నైపుణ్య శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్"

Post a Comment