రెండేళ్లకే ‘పదోన్నతి’?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ
ఉద్యోగుల పదోన్నతి సర్వీసు కాలాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం
యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో
పదోన్నతి పొందాలంటే సదరు ఉద్యోగి కనీసం 3 ఏళ్లు ప్రస్తుత హోదాలో పనిచేసి
ఉండాలనే నిబంధన ఉండేది. దీని ప్రకారం మూడేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగులకే
పదోన్నతు లకు అవ కాశం ఉండేది.
ఇప్పుడు ఆ సర్వీసు కాలాన్ని రెండేళ్లకు
తగ్గించే ప్రతి పాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ
పరిధిలోనికి వచ్చే ఉద్యోగుల్లో ఎంత మంది రెండేళ్ల సర్వీసు పూర్తి
చేసుకున్నారు, అందులో ఎంత మంది పదోన్న తులకు అర్హులవుతారో వివరాలు పంపాలని
అన్ని ప్రభుత్వ శాఖలను ఆర్థిక శాఖ కోరింది.
ఈ వివరాలను పంపాలని ఇటీవల శాఖల
హెచ్‌వోడీలకు లేఖ రాసింది
0 Response to "రెండేళ్లకే ‘పదోన్నతి’?"
Post a Comment