7718955555 : ఇక గ్యాస్ బుకింగ్ నెంబర్ ఇదే!
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నవంబర్ 1నుండి దేశమంతటా ఒకే నంబర్ ద్వారా ఎల్‌పిజి బుకింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఒసి) ప్రకటించింది. విజయవాడలోని ఐఒసి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ సేల్స్ ప్యూటీ మేనేజర్ ఫుల్‌జెలె మాట్లాడుతూ
వినియోగదారులు ఆ తేది నుండి 7718955555 నెంబర్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాల్సిఉంటుందని చెప్పారు. మిగిలిన అన్ని ఫోన్ నంబర్లను అక్టోబర్ 31 నుండి నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
ఈ నంబర్ 24 గంటలు పనిచేస్తుందన్నారు. వినియోగదారులు రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ల నుండే బుకింగ్ చేసుకోవాల్సిఉంటుందని, దానికిగానూ, తమ కన్య్జూమర్ నెంబర్‌ను నమోదు చేసుకోవాలని సూచించారు
0 Response to "7718955555 : ఇక గ్యాస్ బుకింగ్ నెంబర్ ఇదే!"
Post a Comment