22 నుంచి సీబీఎస్‌ఈ 10, 12 సప్లిమెంటరీ పరీక్షలు
దిల్లీ:
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 29
వరకు జరగనున్నాయి. వీటితో పాటు మార్కులు మెరుగుపరచుకోవాలనుకుంటున్న 12వ
తరగతి విద్యార్థులకూ పరీక్షలు నిర్వహించనుంది. కొవిడ్-19 నేపథ్యంలో
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని,
శానిటైజర్లను సొంతంగా తీసుకురావాలని సీబీఎస్‌ఈ ఓ ప్రకటనలో తెలిపింది.
అంతకుముందు కరోనా నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేయాలంటూ వేసిన
పిటిషన్‌ను సుప్రీంకోర్టులో సీబీఎస్‌ఈ తీవ్రంగా వ్యతిరేకించింది.
విద్యార్థుల భధ్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని సురక్షిత చర్యలు
తీసుకుంటున్నామని కోర్టుకు తెలిపింది. కేసును కోర్టు ఈనెల 10కి వాయిదా
వేసింది
0 Response to "22 నుంచి సీబీఎస్‌ఈ 10, 12 సప్లిమెంటరీ పరీక్షలు"
Post a Comment