Unlock 4.0 from Sept 1: అన్‌లాక్ 4లో ఏవి తెరుస్తారు? ఏవి తెరవరు? పూర్తి వివరాలు
Unlock 4.0 from Sept 1: ఆగస్ట్ ఆఖరితో అన్‌లాక్-3 ముగిసి... సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్-4.0 మొదలవ్వనుంది. దీనిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం ఎక్కువైంది. అన్నీ తెరిచేస్తారనీ, ఇక అసలు ఎలాంటి కండీషన్లూ ఉండవని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అవి నిజం కావు. మన కేంద్ర ప్రభుత్వం... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం నడుచుకుంటోంది. ప్రపంచంలో ఇప్పుడు ఇండియాలోనే కరోనా డైలీ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి కాబట్టి... ఇండియాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒత్తిడి ఉంది. ఇలాంటి సమయంలో... అన్నీ తెరిచేసి... ప్రపంచ దేశాల అభ్యంతరాల్ని పొందాలని కేంద్రం భావించట్లేదు. అందువల్ల సెప్టెంబర్ 1 నుంచి ఏవి తెరుస్తారో, ఏవి తెరవరో, టోటల్‌గా ఏ రూల్స్ అమల్లో ఉంటాయో పక్కా క్లారిటీతో తెలుసుకుందాం.
- ఈసారి బార్లలో కౌంటర్ దగ్గర లిక్కర్ అమ్మేందుకు అనుమతి ఇస్తారనీ అయితే... టేక్ ఎవే సర్వీసులకు మాత్రమే అనుమతిస్తారని తెలిసింది. బార్లు కూడా మార్చి 25 నుంచి మూసి ఉన్నాయి.
- స్కూళ్లు, కాలేజీలు మాత్రం సెప్టెంబర్‌లో కూడా మూసే ఉంటాయని తెలిసింది. IITలు, IIMలు మాత్రం తెరుస్తారని సమాచారం అందుతోంది.
- థియేటర్లు, ఆడిటోరియంలు మరో నెలపాటూ మూసే ఉంచుతారని తెలిసింది. ఇప్పుడు సినిమా హాళ్లను తెరిస్తే... 25 నుంచి 30 శాతం కెపాసిటీతోనే సినిమాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అది ఎంతమాత్రం లాభదాయకం కాదు. అందువల్ల ఈసారికి థియేటర్లకు ఛాన్స్ లేనట్లే అని తెలిసింది.
- సోషల్, పొలిటికల్, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, అకడమిక్, కల్చరల్, మతపరమైన సమావేశాలు, సభలు, ఫంక్షన్లు, వేడుకలు, పెద్ద ఎత్తున జనం గుమికూడటాలు వంటివాటికి... సెప్టెంబర్ తర్వాత కూడా అనుమతి ఉండదని తెలుస్తోంది.- కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రకారం... కంటైన్‌మెంట్ జోన్లలో... అన్‌లాక్-4లో కూడా కఠినమైన లాక్‌డౌన ఉంటుంది. వాటిని నిరంతరం మానిటరింగ్ చేస్తూనే ఉంటారు.
- కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేశాక... వాటిపై ఫైనల్ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. అందువల్ల కేంద్రం అనుమతించినా... కొన్ని రాష్ట్రాలు అనుమతించకపోవచ్చు. అలాగే... కేంద్రం అనుమతించనివాటిని రాష్ట్రాలు కూడా అనుమతించకపోవచ్చు. కారణం కరోనా ఎక్కువగా ఉంది కాబట్టే
0 Response to "Unlock 4.0 from Sept 1: అన్‌లాక్ 4లో ఏవి తెరుస్తారు? ఏవి తెరవరు? పూర్తి వివరాలు"
Post a Comment