ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షలకు చేరువలో

 ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షలకు చేరువలో!

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 



తాజాగా 24 గంటల వ్యవధిలో 72 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, 2,632 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం కేసులు 69 లక్షలు దాటిపోయాయి. ఒకట్రెండు రోజుల్లో 70 లక్షల మార్కును అధిగమించనున్నాయి. మరణాలు 4 లక్షలు మించిపోయాయి



.

అమెరికాలో మొత్తం కేసులు 19.74 లక్షలు, మరణాలు 1.11 లక్షలు దాటాయి. కొత్తగా 8,791 మంది వైరస్‌కు చిక్కగా, 237 మంది మృత్యువుపాలయ్యారు. ఇండోనేసియాలో కొత్తగా 993 కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో శనివారం కొత్తగా 51 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో కొత్తగా ఐదు మందికి పాజిటివ్‌ ఫలితం వచ్చింది. 


వీరిలో ముగ్గురు ఇతర దేశాల నుంచి వచ్చినవారే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 83,030కి చేరింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షలకు చేరువలో"

Post a Comment