జీవిత బీమా పాలసీల పునరుద్ధరణ గడువు పెంపు
జీవిత బీమా పాలసీల పునరుద్ధరణ గడువు పెంపు
దిల్లీ: లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో జీవిత బీమా పాలసీల పునరుద్ధ రణ గడువును పెంచుతున్నట్లు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధి కారిక సంస్థ (ఐఆర్‌డీఏఐ) వెల్లడించింది.
మార్చి 31 లోపు ప్రీమియం చెల్లిం చాల్సిన వారికి మే 31 వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. మార్చి, ఎప్రిల్ నెలల్లో చెల్లించాల్సిన ప్రీమియం లకు 30 రోజుల పాటు అదనపు సమయం ఇస్తు న్నట్లు గత మార్చి 23, ఏప్రిల్ 4 తేదీల్లో ఐఆర్‌డీఏఐ ప్రకటించిన సంగతి తెలి సిందే. ఇప్పుడు ఆ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
0 Response to "జీవిత బీమా పాలసీల పునరుద్ధరణ గడువు పెంపు"
Post a Comment