డీఏ నిలిపివేత, కేంద్రానికి మిగలిలేది ఎంతంటే

ఢిల్లీ: కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అవుతుండటంతో కేంద్రం పొదుపు మంత్రం జపించింది.

ఉద్యోగులకు అందించే డీఏను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అంతే కాకుండా ఏరియర్స్ చెల్లింపులను కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కొన్ని రాష్రాలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తే



. కేంద్రం ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ మార్గం ఎంచుకుంది.  మరి ఈ చర్య ద్వారా కేంద్రానికి ఆదా అయింది ఎంత అనే సహజంగానే వస్తుంది. డీఏలను నిలిపివేయడం ద్వారా కేంద్రానికి 37 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక రాష్ట్రాలు కూడా కేంద్రం బాట పడితే మరో 82 వేల కోట్ల రూపాయలు మిగులు సాధించే అవకాశం. కేంద్రం, రాష్ట్రాల మిగులు కలిపి చూస్తే వచ్చే రెండేళ్లలో దాదాపు రూ. 1.20 లక్షల కోట్లు ఆదా అయ్యే అవకాశం కనిపిస్తోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డీఏ నిలిపివేత, కేంద్రానికి మిగలిలేది ఎంతంటే"

Post a Comment