పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువే: జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పథకం ప్రారంభమైంది. ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దాదాపు 12లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా సీఎం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, విద్యార్థుల తల్లులతో మాట్లాడారు
విద్యా దీవెనలో భాగంగా రెండు పథకాలు తీసుకొచ్చాం. బోర్డింగ్, లాడ్జింగ్..పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఒక్క చదవే. మంచి చదువుతోనే పేదల బతుకులు మారుతాయి.
మార్చి 31వరకు ఉన్న పూర్తి బకాయిలను ఇస్తున్నాం. 2018-19లో గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.1880 కోట్లు పూర్తిగా చెల్లిస్తున్నాం.
ఈ ఏడాదికి సంబంధించి ఒక్క పైసాకూడా బకాయి లేకుండా చెల్లిస్తున్నాం. 2020-21లోనూ ప్రతి త్రైమాసికం తర్వాత తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తాం. కళాశాలల్లో సదుపాయాలు లేకపోతే 1902కు తల్లులు ఫోన్ చేయవచ్చు’’ అని సీఎం వివరించారు
0 Response to "పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువే: జగన్"
Post a Comment