ప్రభుత్వోద్యోగుల పింఛన్లలో కోత లేదు : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వోద్యోగుల పింఛన్లను తగ్గించాలనే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం స్పష్టం చేసింది. ఈ విషయంలో జరుగుతున్నదంతా నిరాధార ప్రచారమేనని స్పష్టం చేసింది. 



కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అమలవుతున్న అష్ట దిగ్బంధనంతోపాటు రాబోయే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ పింఛనుదారుల పింఛన్లలో 20 శాతం కోత విధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వార్తలు ప్రచారమవుతున్నట్లు గుర్తించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) తెలిపింది. ఈ వార్తలు పింఛనుదారులను ఆందోళనకు గురి చేస్తున్నట్లు పేర్కొంది.


గతంలో వివరణ ఇచ్చినట్లుగానే, ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లను తగ్గించడం కానీ, నిలిపేయడం కానీ జరగదని, అటువంటి ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని డీఓపీపీడబ్ల్యూ స్పష్టం చేసింది. పింఛనుదారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. 


ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వోద్యోగుల పింఛన్లను తగ్గించడం లేదా నిలిపేయడం గురించి ప్రతిపాదన ఏదీ లేదని తెలిపారు. రానున్న సంవత్సరంలో 1 లక్ష ప్రభుత్వోద్యాగాలను భర్తీ చేస్తామన్నారు. 


దీంతో 65.26 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులకు గొప్ప ఊరట లభించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రభుత్వోద్యోగుల పింఛన్లలో కోత లేదు : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ"

Post a Comment