ఆదాయం ఉంది.. జీతాలివ్వొచ్చు: టీడీపీ
- సమస్యను భూతద్దంలో చూపే యత్నం
- టీడీపీ టెలి కాన్ఫరెన్స్‌లో నేతల వ్యాఖ్య
- ఆదాయ వివరాలు ఇవ్వాలని డిమాండ్
అమరావతి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ‘‘ఉద్యోగులకు జీతాలు పూర్తిగా ఇవ్వగలిగిన పరిస్థితిలోనే రాష్ట్ర ఆదాయం ఉంది. వారి జీతాలు తగ్గించి ఇవ్వాల్సినంత ఇబ్బందికర పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవు’’ అని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఆపార్టీ అధినేత చంద్రబాబు బుధవారం తమ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దానిలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం...
ఉద్యోగులకు ఈ నెల జీతాలు సగం తగ్గించి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చింది. జనవరి, ఫిబ్రవరిల్లో రాష్ట్ర ఆదాయం ఎంత ఉందో మార్చిలో కూడా అంతే ఉందని కొందరు మాజీ మంత్రులు చెప్పారు. ఉద్యోగులకు జీతాలు కోతకోసి ఇవ్వాల్సినంత కిష్ట పరిస్థితులేవీ రాలేదని స్పష్టం చేశారు. మార్చి చివరివారంలో పెట్టిన లాక్‌డౌన్‌తో ఆదాయం ఘోరంగా పడిపోయే అవకాశం లేదని ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ‘మార్చిలోనూ ప్రభుత్వం తనకు కావాల్సినవారికి బిల్లులు చెల్లిస్తూనే ఉంది
కరోనా కోసం పెద్దగా ఖర్చు చేసిందేమీలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జీతాల్లో
కోతెందుకు? లేని సమస్యను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఒక
మాజీమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆదాయం తగ్గిందని ప్రభుత్వం వాదిస్తే
జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఆదాయ వివరాలు ప్రజల ముందుపెట్టాలని
మరో మాజీమంత్రి డిమాండ్ చేశారు. వారి వాదనను విన్న చంద్రబాబు ‘మీ
అభిప్రాయాలు విలువైనవిగా అనిపిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
కరోనా నిరోధానికి కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బందికి అవసరమైన రక్షణ
సామగ్రి కూడా ప్రభుత్వం చాలినంతగా ఇవ్వలేకపోతోందని కొందరు నేతలు వివరించారు
0 Response to "ఆదాయం ఉంది.. జీతాలివ్వొచ్చు: టీడీపీ"
Post a Comment