ఆదివారం ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి జ్యోతులు వెలిగించాలి
PM Narendra Modi Message: ఈ ఆదివారం ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి జ్యోతులు వెలిగించాలి, దేశ ప్రజలంతా మహా జాగరణ చేయాలి. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం
New Delhi, April 3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. ప్రస్తుతం లాక్ డౌన్ యొక్క రెండవ వారం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న 11 రోజులు అత్యంత కీలకమైనవిగా మోదీ పేర్కొన్నారు.
కోవిడ్-19కు వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకతాటిపై వచ్చి చేస్తున్న సమిష్టి పోరాటానికి (Fight Against COVID-19) సంఘీభావంగా ఈ ఆదివారం ఏప్రిల్ 05న రాత్రి 9 గంటలకు దేశంలోని ప్రతి ఇంటిలోని సభ్యులు వారి ఇంట్లోని విద్యుత్ దీపాలను ఆర్పివేసి గుమ్మం ఎదుట 9 నిమిషాల పాటు జ్యోతులను లేదా దీపాలను వెలిగించాలని కోరారు.
అదీకాకపోతే పౌరులందరూ తమ తమ బాల్కనీలలోకి, ఇంటి ప్రాంగణంలోకి వచ్చి మొబైల్ ఫోన్లలోని ప్లాష్ లైట్లు లేదా టార్చ్ లైట్లనైనా వెలిగించాలని సూచించారు
0 Response to "ఆదివారం ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి జ్యోతులు వెలిగించాలి"
Post a Comment