మే 26 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు?
చెన్నై : టెన్త్ పబ్లిక్ పరీక్షలను మే 26వ తేదీ ప్రారంభించి ఐదు రోజుల్లో ముగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
ప్రతి విద్యాసంవత్సరం మార్చి, ఏప్రిల్ మాసాల్లో టెన్త్, ప్లస్ వన్, ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది గత నెల 24వ తేదీ నుంచి లాక్ డౌన్ ప్రారంభమైంది.
ఆ తేదీలోపు ప్లస్ టూ పరీక్షలు ముగియగా, ప్లస్ వన్‌కు ఒక పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అదే నెలలో 27వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన టెన్త్ పబ్లిక్ పరీక్షలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి.
ఈ నేపథ్యంలో లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించడంతో అనంతరం పరిస్థితులను పరిశీలించి మే 26 నుంచి 30వ తేదిలోపు టెన్త్ పబిక్ పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. అనంతరం మూల్యాంకన పనులు చేపట్టి జూన్ నెలాఖరులోపు ఫలితాలు విడుదల చేస్తే వచ్చే విద్యా సంవత్సరానికి ఎలాంటి ఇబ్బందులుండడని విద్యాధికారులు యోచిస్తున్నారు. అలాగే, ప్లస్ టూ పరీక్షల మూల్యాంకన పనులను కూడా మే మూడవ వారంలో ప్రారంభించి జూన్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తే టెన్త్, ప్లస్ టూ ఫలితాలను వెల్లడించాలని అధికారులు నిర్ణయించారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని విద్యాధికారులు పేర్కొంటున్నారు
0 Response to "మే 26 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు?"
Post a Comment