ఉద్యోగుల విరాళాలు ఫారం 16లో చూపాలి

ఉద్యోగుల వేతనాల నుంచి ప్రధాన మంత్రి సిటిజెన్‌ అసిస్టెంట్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిచువేషన్స్‌(పీఎమ్‌-కేర్స్‌) నిధికి వితరణలు చేసిన పక్షంలో ఆయా కంపెనీలు ఆ వివరాలను ఫాం 16 టీడీఎస్‌ సర్టిఫికెట్‌లో పొందుపరచాలని ఆదాయ పన్ను విభాగం స్పష్టం చేసింది.




ఐటీ చట్టంలోని 80జీ కింద పీఎమ్‌ కేర్స్‌కు చేసే వితరణలకు 100 శాతం మినహాయింపు వర్తిస్తుందన్న సంగతి తెలిసిందే.

కంపెనీ ద్వారా ఉద్యోగి చేసే వితరణలకు విడిగా 80జీ కింద ధ్రువపత్రం ఏమీ ఉండదని అందుకే ఇలా ఫాం 16లో చూపించాలని కోరుతున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగుల విరాళాలు ఫారం 16లో చూపాలి"

Post a Comment