రాష్ట్రంలో 154 క్లస్టర్లు: జవహర్‌రెడ్డి
విజయనగరం, శ్రీకాకుళం మినహా మిగిలిన 11 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్ జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. రాష్ట్రంలో నమోదైన 500 పైచిలుకు పాజిటివ్ కేసులు కేవలం 94 మండలాల పరిధిలోనే ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌రెడ్డి అన్నారు.
వీటిలో 46 అర్బన్ మండలాలు కాగా మరో 48 రూరల్ మండలాలని చెప్పారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కంటైన్‌మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు 154 క్లస్టర్లు ఏర్పాటు చేశాం. వీటి పరిధిలో గత పది రోజుల్లోనే 12వేల పైచిలుకు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాం.
కొవిడ్ టెస్టులు చేయడంలో దేశంలో టాప్-5లో ఏపీ ఉంది. వచ్చే వారంరోజుల్లో రోజుకు 17వేల పరీక్షలు నిర్వహించే స్థాయికి తీసుకువెళ్లాలనేది మా ప్రయత్నం. వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా ఇప్పటికే మూడుసార్లు సింప్టమేటిక్ సర్వే చేయించగా 32వేల మంది అనుమానితులు తేలారు. వీరందరికీ వారం రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తాం. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ సడలింపు ఉండదు. ఆంక్షలు మరింత కఠినంగా అమలవుతాయి’ అని చెప్పారు
0 Response to "రాష్ట్రంలో 154 క్లస్టర్లు: జవహర్‌రెడ్డి"
Post a Comment