నేడు లెనిన్ 150వ జయంతి
*నేడు లెనిన్ 150వ జయంతి!*
*విప్లవ మార్గదర్శకమూర్తి నుండి విప్లవస్ఫూర్తిని పొందుదాం.*
*కారల్ మార్స్ జీవితకాలం 65 ఏళ్ళు! ఫ్రెడరిక్ ఎంగెల్స్ జీవితకాలం 75 ఏళ్ళు! లెనిన్ జీవితకాలం 54 ఏళ్ళు మాత్రమే!* మార్క్స్, ఎంగెల్స్ ప్రపంచ చరిత్ర గతిని మార్చే ఓ మహత్తర సిద్ధాంత కర్తలయ్యారు. వారిద్దరూ కేవలం సిద్ధాంత కర్తలుగానే మిగిలిపోలేదు. తమ జీవితకాలంలో ఫ్రాన్స్, జర్మన్, బెల్జియం, పోలండ్ తదితర దేశాల్లో తలెత్తిన శ్రామికవర్గ పోరాటాలకు సారథ్యం వహించారు. పారిస్ లో విప్లవ రాజ్యావిష్కరణ సమయంలో దానికి సైద్ధాంతిక దారిదీపాలుగానూ వెలుగొందారు. ఎంగెల్స్ ది మరో ముందడుగు! స్వయంగా విప్లవ యుద్ధక్షేత్రాల్లో బారికేడ్ల వద్ద నిలిచి, తాను సాయుధుడై పోరాడుతూ, వర్కర్స్ బ్రిగేడ్స్ ని గైడ్ చేసాడు.
👉రష్యాలో లెనిన్ ది ఓవైపు సిద్ధాంతకర్తగా, మరోవైపు రాజకీయ విప్లవ ఆవిష్కర్తగా ఏకకాలంలో సమాంతర కృషీవలుడిపాత్ర కూడా!
*లెనిన్ 1870 ఏప్రిల్ 22న జన్మించాడు* . ( *నేటికి 150 ఏళ్ళు* ) కజాన్ విశ్వవిద్యాలయం లో "లా" కోర్సు చదువుతుండగా తన 18వ ఏట 1887లో విప్లవ రాజకీయాల్లో పాల్గొన్నాడనే నెపంతో డిస్మిస్ అయ్యాడు. (నిజానికి దానికి కొంతముందు నుండే విద్యార్థి ఉద్యమ జీవితం ఉంది) నాటి నుండి 1924 జనవరి లో మరణించడానికి కొద్ధిముందు వరకు (పక్షవాతం తిరగబెట్టి మెదడు పనిచేయలేని స్థితి ఏర్పడేంత వరకూ) అంటే దాదాపు 35 ఏళ్ళ రాజకీయ జీవితం లెనిన్ కి వుంది. నాడు కుహనా నాగరిక యూరోప్ ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటనగా & అట్టి యూరోప్ చేత అనాగరిక ఖండంగా పిలవబడే ఆసియా దేశాల రాజకీయవ్యవస్తని కుదిపేసిన సంఘటనగా పేరొందిందే 1905 నాటి ప్రధమ రష్యన్ విప్లవం! ఆ విప్లవం నాటికి లెనిన్ వయస్సు కేవలం 35ఏళ్ళు! అప్పటికి ఆయన రాజకీయ జీవితకాలం కేవలం 18 ఏళ్ళు! 1917 అక్టోబర్ విప్లవ ఆవిష్కరణ నాటికి లెనిన్ వయస్సు కేవలం 47ఏళ్ళు! రాజకీయ జీవితం కేవలం 30 ఏళ్ళు! మరణం నాటికి లెనిన్ వయస్సు కేవలం 54 ఏళ్ళు! రాజకీయ జీవితం కేవలం 37 ఏళ్ళు! (అర్థవంతమైన పదంగా "కేవలం" ని ఉపయోగించా)
👉లెనిన్ విప్లవ రాజకీయ జీవిత కాలం పాతికేళ్లు మాత్రమే! ఒకవైపు ప్రపంచ శ్రామికవర్గ విమోచనా తాత్విక సిద్ధాంత ఆవిష్కర్తగా; మరోవైపు రష్యా రాజకీయ విప్లవ ఆవిష్కర్తగా లెనిన్ ఏకకాలంలో ఎనలేని సమాంతర ద్విముఖ కృషిని సాగించాడు. అట్టి లెనిన్ స్మరణ, స్ఫూరణ, స్పూర్తి, ప్రేరణ నేడు శ్రామికవర్గ సంస్థలకీ, శక్తులకీ చారిత్రక ఆవశ్యకం! నేడు లెనిన్ 150వ జయంతి సంస్మరణకి నేటి కరోనా కల్లోల కాలం ఆటంకం కాకూడదని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.
👉ఔను, లెనిన్ నుండి నేర్చుకునే కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. అవి ఏమిటి?
👉నిర్దిష్ట దేశభౌతిక స్థితిగతులని అధ్యయనం చేసిన వాడే లెనిన్!
👉నాడి పట్టుకొని చికిత్స చేసే వైద్యుడి వంటి వాడు లెనిన్! సరైన సమయం లో సరైన రాజకీయ ఎత్తుగడలు వేయడంలో దిట్ట లెనిన్! రాజకీయ భౌతిక స్థితిగతులకు అనుగుణంగా సిద్ధాంతాన్ని ఆచరణకి అన్వయింపు చేసిన మహనీయుడే లెనిన్!
👉న్నీళ్ళ ల్లో చేపలవలె జనంతో కమ్యూనిస్టు శక్తులు మమేకమైతేనే జనవిప్లవాల ఆవిష్కరణ జరుగుతుందని నమ్మిన వాడే లెనిన్!
👉పార్టీని ఉక్కుక్రమశిక్షణ తో సుశిక్షితంగా నిర్మించినవాడే లెనిన్! సరైన విప్లవ తాత్విక సిద్ధాంతాలను రూపకల్పన చేస్తే సరిపోదనీ, విప్లవ ఆదర్శాలతో కూడిన ఆదర్శ కమ్యూనిస్టు జీవితాల్ని సామాన్య ప్రజలకు పార్టీ నాయకత్వం అందించాలనీ ప్రబోధించించిన వాడే లెనిన్!
👉సోషలిజం వచ్చిన తర్వాత కూడా స్మోల్నీ భవన్ లో నిరాడంబరంగా జీవించిన వాడే లెనిన్!
👉మొత్తం 14సామ్రాజ్యవాద రాజ్యాల ముట్టడి లో తొలిసోషలిస్టు రాజ్యం ఆర్ధికంగా చితికిన కాలంలో దేశప్రజలతో పాటు నాసిరకం రేషన్ తిండితో సరిపెట్టుకొని బ్రతికిన కుటుంబం లెనిన్ ది. 👉రష్యా దేశ ప్రజలందరూ రొట్టెలతో బ్రతికే రోజుల్లో రష్యా సోషలిస్టు విప్లవ రాజ్యాధినేతగా కేకులు తినే నైతిక హక్కు తనకు లేదని వాటిని తోసిపుచ్చిన ఆదర్శ విప్లవ మూర్తి లెనిన్!
👉అందుకే ఓవైపు సిద్ధాంతా (లైన్) రీత్యా, మరోవైపు జీవితాచరణ (లైఫ్) రీత్యా ప్రజల నాడిని పట్టుకొని, ప్రజల హృదయాల్ని గెలుచుకుని తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వాడే లెనిన్!
👉 నూరేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమ వైఫల్యాలకు కారణాలు లెనిన్ విశిష్ట విప్లవ జీవితంలో దొరుకుతాయి.
👉👉చారిత్రక, రాజకీయ గుణపాఠాలకీ లెనిన్ ఓ చిరునామా!
👉150వ జయంతి సందర్భంగా స్మరించుకుని విప్లవ స్ఫూర్తిని పొందుదాము
0 Response to "నేడు లెనిన్ 150వ జయంతి"
Post a Comment