ఈ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

ఈ 21 రోజులు బయటకు వెళ్లాలనే ఆలోచనే మానుకోండి 

దిల్లీ: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రానున్న 21 రోజులు చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారన్నారు. ఈ 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదన్నారు. కొన్నాళ్ల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ 21 రోజులు జాగ్రత్తగా ఉందాం.. దేశాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు



ఈ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

దిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ అర్ధరాత్రి నుంచి మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం రాత్రి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం. కానీ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఇది తప్పనిసరి. ఇది కర్ఫ్యూ తరహా వాతావరణం. ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి వీధి లాక్‌డౌన్‌. దీన్ని ప్రతిఒక్కరూ పాటించాలి. ఏ ఒక్క పౌరుడూ గడప దాటి బయటకు రావొద్దు. జనతాకర్ఫ్యూకు మించి లాక్‌డౌన్‌ అమలు చేస్తాం’’ అని అన్నారు


అలా చేస్తే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కలేం: మోదీ

దిల్లీ: మార్చి 22న ప్రజలంతా జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మంగళవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. సంకట సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలిచింది. కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందో వార్తల్లో చూస్తున్నాం.  ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి. ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ ఇళ్లల్లోనే ఉండాలి. ఈ విధంగా ఉంటే తప్ప ఈ గండం నుంచి గట్టేక్కే పరిస్థితి లేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాయి’’ అని మోదీ అన్నారు



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఈ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌"

Post a Comment