బీమ్‌ యాప్‌ ద్వారా ఫాస్ట్‌ టాగ్‌ రీఛార్జ్‌

నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఎన్‌ఇటిసి) ఫాస్ట్‌టాగ్‌లను భీమ్‌ యాప్‌ ద్వారా కూడా రీఛార్జ్‌ చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ) వెల్లడించింది. దీంతో ఫాస్ట్‌టాగ్‌ రీఛార్జ్‌ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. 



ఇప్పుడు భీమ్‌ యాప్‌ కూడా.. 
భీమ్‌ యాప్‌ ద్వారా కూడా బీమ్‌ యుపిఐను రీఛార్జ్‌ చేసుకోవచ్చని ఎన్‌పిసిఐ తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులతో పాటు కొన్ని ప్రయివేటు బ్యాంకులు, పేటీఎం వంటి యాప్స్‌ ద్వారా ఫాస్ట్‌టాగ్‌ను రీఛార్జ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు భీమ్‌ యాప్‌లో కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది

భీమ్‌ యాప్‌ కలిగిన వాహనదారు/ యజమాని ఇక నుంచి ఫాస్ట్‌ టాగ్‌ను రీఛార్జ్‌ చేసుకోవచ్చని, తద్వారా టోల్‌ ప్లాజాల వద్ద గంటల తరబడి వేచి ఉండే అవసరం లేదని తెలిపింది. 
ఎలా చేసుకోవాలి? 
భీమ్‌ యాప్‌ ద్వారా వినియోగదారులు సులభంగా ఫాస్ట్‌టాగ్‌ను రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ముందుగా సంబంధిత వాహనదారుడు/ వాహన వినియోగదారుడు బీమ్‌ యుపిఐ యాప్‌లోకి లాగిన్‌ కావాలి. ఆ తర్వాత సెండ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. ఎన్‌ఇటిసి ఫాస్ట్‌టాగ్‌ యుపిఐ ఐడిని ఎంటర్‌ చేయాలి. తర్వాత యూపీఐని వెరిఫై చేసేందుకు క్లిక్‌ చేయమని అడుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రీఛార్జ్‌ ఎంత కావాలో ఎంటర్‌ చేయాలి. అథంటికేషన్‌ కోసం పిన్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాహనదారులు ఫాస్టాగ్‌ వ్యాలెట్‌కు క్రెడిట్‌ను నిర్ధారించే ఓ ఎస్సెమ్మెస్‌ వస్తుంది. 
టోల్‌ ప్లాజాల వద్ద ఈజీగా... 
టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారుల చెల్లింపులు వేగవంతం చేసే క్రమంలో భాగంగా ఫాస్ట్‌టాగ్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త విధానం వల్ల టోల్‌ చెల్లింపుకు సంబంధించి వాహనదారుల సమయం వృధా కాదు. ఇంధనం ఆదా అవుతుంది. టోల్‌ ప్లాజాల వద్ద క్రమంగా క్యూలైన్లు తగ్గుతాయి. ప్రీపెయిడ్‌ లేదా సేవింగ్స్‌ అకౌంటుకు అనుసంధానించే ఫాస్ట్‌ టాగ్‌లను వాహనం విండ్‌ స్క్రీన్‌ పైన అతికిస్తారు. టోల్‌ప్లాజాల్లో ఏర్పాటు చేసిన రీడర్లు వీటిని స్కాన్‌ చేస్తాయి. తద్వారా వాహనదారు ఖాతా నుంచి నిర్దేశిత టోల్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆటోమేటిక్‌గా పూర్తవుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బీమ్‌ యాప్‌ ద్వారా ఫాస్ట్‌ టాగ్‌ రీఛార్జ్‌"

Post a Comment