సీఎం సహాయ నిధికి విరాళాలివ్వండి: ఏపీ భవన్‌

న్యూఢిల్లీ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నిరోధించడానికి  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా సాయమందించేందుకు దాతలు ముందుకు రావాలని ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌  అభయ్‌ త్రిపాఠి శనివారం ఓ ప్రకటన లో కోరారు. 



ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. చెక్కు రూపంలో లేదా బ్యాంకు ఖాతాకు  నేరుగా విరాళాలు అందించవచ్చని, వీటికి పన్ను మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. చెక్కు ద్వారా అయితే ‘చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌, ఆంధ్రప్రదేశ్‌’ అని, 



ఆన్‌లైన్‌లో అయితే,  1))SBI Ac-count No. 38588079208, Velagapudi Secretariat Branch, IFSC Code: SBIN0018884, (2) Andhra Bank AccountNo. 110310100029039, Velagapudi Secretariat Branch, IFSC Code:-AN-DB0003079కు పంపించాలని కోరారు. వెబ్‌ సైట్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా పంపించదలచినవారు 



apcmrf.ap.gov.inను సంప్రదించాలన్నారు. చెక్కుల కోసం ఏపీ భవన్‌లో డ్రాప్‌ బాక్సు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీఎం సహాయ నిధికి విరాళాలివ్వండి: ఏపీ భవన్‌"

Post a Comment