స్కూళ్లలో పనిచేసే టీచర్లు, సిబ్బందిపై పోలీసు వెరిఫికేషన్
హాస్టళ్లు, క్రీడా అకాడమీలు.. బాలలతో ముడిపడ్డ ప్రతి సంస్థలో కూడా
చైల్డ్ పోర్నోగ్రఫీపైనా కఠిన చర్యలు
పోక్సో నిబంధనల్లో కీలకాంశాలివే
న్యూఢిల్లీ, మార్చి 13: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు, కీలక ఉద్యోగాల్లో అభ్యర్థుల గుణగణాలను తెలుసుకునేందుకు.. వారి నేర చరిత్రను గుర్తించేందుకు పోలీసు వెరిఫికేషన్ చేయడం తెలిసిందే. ఇకపై స్కూళ్లు, హాస్టళ్లు, బాలబడి(క్రె్‌షలు), క్రీడా అకాడమీలు.. బాలలతో ముడిపడి ఉన్న ప్రతి సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందిపై కూడా ఇదే తరహాలో పోలీసు వెరిఫికేషన్ జరగనుంది. వారి మానసిక స్థితి ఏంటి? ఎలాంటి వారు? చిన్నారులపై నేరాలకు పాల్పడే ధోరణి ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరపుతారు.
బాలలపైపై లైంగిక నేరాల నిరోధ (పోక్సో) నిబంధనలు-2020 ప్రకారం ఇకపై పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ నెల 9 నుంచి పోక్సో నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అంతేకాదు.. బాలల భద్రతపై వారిలో అవగాహన పెంచేందుకు తరచూ వర్క్‌షాపులు నిర్వహిస్తారు. చిన్నారుల గుర్తింపును (భౌతికంగా, వర్చువల్‌గా) భద్రపరిచే అంశానికీ ఈ నిబంధనలు ప్రాధాన్యతనిచ్చాయి. చిన్నారులకు వారి భద్రతపై శిక్షణనివ్వాల్సి ఉంటుంది. చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలోనూ పోక్సో చట్టం, నిబంధనలు కఠినంగా ఉన్నాయి. చైల్డ్ పోర్నోగ్రఫీని ఫోన్లు, కంప్యూటర్లలో, ఇతర ఎలకా్ట్రనిక్ ఉపకరణాల్లో కలిగి ఉన్నా.. ఇతరులకు పంపినా, ఇతరులకు చూపినా, చిన్నారులకు చూపించినా కఠిన శిక్షలు ఉంటాయి. ఈ మేరకు పోక్సో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, విధివిధానాలను రూపొందించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది
0 Response to "స్కూళ్లలో పనిచేసే టీచర్లు, సిబ్బందిపై పోలీసు వెరిఫికేషన్"
Post a Comment