9 నుంచి ఇంటర్ పరీక్షల మూల్యాంకనం
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 9 నుంచి ప్రారంభమవుతుందని ఆర్‌ఐవో వీవీ సుబ్బారావు తెలిపారు. మొదటి విడత స్థానిక ఏకేవీకే జూనియర్ కళాశాలలో ఉదయం 12 గంటలకు మొదలవుతుందన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలల సంస్కృత అధ్యాపకులు తప్పనిసరిగా మూల్యాంకనానికి
హాజరుకావాలన్నారు. హాజరు కాని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పేపర్-2 పరీక్షకు 963 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 24,938 మందికి గాను 23,975 మంది హాజరైనట్లు వెల్లడించారు
0 Response to "9 నుంచి ఇంటర్ పరీక్షల మూల్యాంకనం"
Post a Comment