2020-21 Radio palaalu

మేషరాశి వారికి తృతీయంలో ఉన్న రాహువు, భాగ్యంలో ఉన్న కేతువు, దశమంలో ఉన్న
శని, తొమ్మిదింట ఉన్న గురువు రవిచంద్ర గ్రహణాలు గురుశుక్ర మౌధ్యమిలు ప్రధాన
ఫలితాలను నిర్దేశిస్తాయి. గ్రహముల రాశి మార్పులను, పరిగణనలోకి తీసుకోవడమైనది.
మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక, ఆరోగ్యపరిస్థితి
బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. గృహసంబంధమైన
వ్యాపారాలు కొంత నత్తనడకన నడిచినా కొన్ని ప్రాజెక్టులలో లాభాలకు ఇబ్బంది ఉండదు.
వెబ్‌సైట్స్‌ వల్ల లాభపడతారు. మితిమీరిన ఆధునిక, సాంకేతిక పరికరాలు కొనుగోలు
చేయరు. అటువంటి వాటికి దూరంగా ఉండాలని భావిస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో
మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తారు.
ఆఫీస్‌కు సంబంధించి బ్రాంచి ఏర్పాటు చేస్తారు. పెట్టుబడికి వెనుదిరగరు. కొత్తవారిని
నియమిస్తారు. అన్నివిధాలా బాగానే చూసుకున్నా కొంతమంది వ్యక్తులు నిత్యం సణుగుతూనే
ఉంటారు. వారివల్ల ప్రయోజనం ఉండదు. అయినా భరించక తప్పదు. ఏ దేవుడికైనా,
దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి.
దొంగస్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉంటారు. వీరి వల్ల హిందూధర్మానికి కళంకాలు




CLICK HERE TO DOWNLOAD
వస్తాయని మీ నమ్మకం. వ్యాపారపరమైన ఆధ్యాత్మిక కేంద్రాలపట్ల, దొంగస్వామీజీల పట్ల
మీకున్న అభిప్రాయాన్ని అందరికీ చెబుతారు. మీడియాకు కూడా వివరాలు అందజేస్తారు.
మీరు ఎంతో రహస్యంగా ఉంచిన మీ వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కుతాయి. ఇది
మీకు మనస్థాపం కలిగిస్తుంది. దీర్ధకాలికంగా పెండింగ్‌లో ఉన్న మీ ఫైళ్ళపై
ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు. సంతాన విద్యావిషయాలు, వ్యక్తిగత విషయాలు
అన్నీ సాధ్యమైనంతవరకు మీరే దగ్గరుండి చూసుకుంటారు. సంవత్సర ద్వితీయార్థంలో
ఫలితాలు చాలా బాగుంటాయి. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.
భగవంతుని సంకల్పం ప్రకారం నడుస్తుందని నమ్మకం కలిగి ఉంటారు. మానసిక
దైవారాధన పెరుగుతుంది. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తున్న ఒక కార్యక్రమాన్ని
ప్రతివ్ధాత్మకంగా తీసుకుంటారు. గాలిలో దీపం పెట్టి దేవునిపై భారం వేయరు. కష్టం,

ప్రతిరోజు ఉ॥ 8.00 గం॥లకు దినఫలాలు, ప్రతి ఆదివారం ఉ॥ 8.00 గం॥లకు రాశిఫలాలు కార్యక్రమం
స్టార్‌ మాటీవీలో తప్పక చూడండి. ౪/4/4/.000414064.00[% చూడండి.
 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "2020-21 Radio palaalu"

Post a Comment