రేషన్ కార్డుకి కొత్త అర్హతలు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆహార భద్రత కార్యక్రమంలో భాగంగా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే నాణ్యమైన బియ్యాన్ని అందించాలని జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యాన్ని అందించేలా శ్రీకాకుళం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే స్వర్ణ బియ్యానికి సమానమైన నాణ్యమైన బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కచ్చితమైన తూకంతో కూడిన ప్యాకెట్ల రూపంలో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా కార్డు దారులకు ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేస్తారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాకు 15వేల టన్నుల బియ్యం అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
రాష్ట్రంలో సివిల్ సప్లయ్స్ సంస్థ ద్వారా కోటి 40లక్షల మంది రేషన్ కార్డుదారులకు సుమారు 11వేల కోట్ల రూపాయల విలువైన బియ్యం కిలో రూపాయికే పంపిణీ చేస్తున్నట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మొత్త రేషన్ కార్డుదారుల్లో 92లక్షల మంది కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండగా.. మిగతా 55 లక్షల మంది కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు.
2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలిథిన్ బ్యాగుల్లో కాకుండా పర్యావరణహితమైన బాగుల్లో బియ్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం నెలకు 2 కోట్ల బ్యాగులు అవసరం అవుతాయన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా బియ్యం ఇతర సరుకులు పంపిణీ చేపట్టినప్పటికీ ప్రస్తుతం ఉన్న రేషన్ డీలర్లు ఎవరినీ తీయబోమని మంత్రి నాని స్పష్టం చేశారు.
0 Response to "రేషన్ కార్డుకి కొత్త అర్హతలు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం"
Post a Comment