గూగుల్‌ మ్యాప్స్‌లో సరికొత్త సూపర్‌ ఫీచర్‌!

ఎప్పటికప్పుడు వివిధ ప్రదేశాలకు ప్రయాణాలు చేసేవారికి సౌలభ్యంగా ఉండే విధంగా అనేక సదుపాయాలు Google Maps లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఒక అద్భుతమైన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మీకు తెలుగు మాత్రమే వచ్చి మహారాష్ట్రలోని ఒక ప్రదేశానికి వెళ్ళినా, లేదా కేరళలోని మరో ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఉండే ఊరిపేర్లు పలకడానికి ఇబ్బందిగా ఉండి ఎవరినైనా హెల్ప్‌ అడగాలి 



అంటే మొహమాట పడుతూ ఉంటాం. గూగుల్‌ మ్యాప్స్‌ స్క్రీన్‌ మీద చూపించ బడే ఆయా ఊరి పేర్లని, లేదా లొకేషన్‌ పేర్లను కూడబలుక్కుని తప్పులతో మాట్లాడుతూ అవతలి వారి ముందు అపహాస్యానికి గురయ్యే సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడం కోసం

అక్కడికక్కడ ట్రాన్స్‌లేషన్‌ సదుపాయంతో పాటు, వివిధ ప్రదేశాల పేర్లు ఆడియో రూపంలో స్థానిక విచారణలో వినిపించే విధంగా కొత్త ఆప్షన్‌ ప్రవేశపెట్టారు. దీన్ని మీరు కష్టపడి సెలెక్ట్‌ చేసుకోవాల్సిన పని లేకుండా మీ ఫోన్లో డిఫాల్ట్‌ భాష ఇంగ్లీష్‌ ఉండి, ఒకవేళ మీరు జపాన్‌కి వెళ్ళినట్లయితే, ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్‌ నుంచి జపనీస్‌కి ట్రాన్స్‌లేషన్‌ సదుపాయాన్ని అందించడంతోపాటు, అప్పటికప్పుడు జపనీస్‌ భాషలో మీకు కావాల్సిన ప్రదేశం పేరు ఆడియో రూపంలో వినిపిస్తుంది. ఈ నెలలో ఆండ్రాయిడ్‌ ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే ఫోన్‌ యూజర్ల కోసం ఈ కొత్త సదుపాయం రాబోతోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గూగుల్‌ మ్యాప్స్‌లో సరికొత్త సూపర్‌ ఫీచర్‌!"

Post a Comment