కేరళ విద్యావిధానం దేశానికే ఆదర్శం

తరగతి గదుల్లో బోధన,అభ్యాసన పద్ధతులను కేరళలోని పాఠశాలలు పునర్విచిస్తున్నాయి. అందుబాటులో ఉన్న వనరులు, కళాకారు లు, కళాకృతులను ఆధారంగా చేసుకొని 'జనకీయ విద్యాభ్యాస మాతృక అనే విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ విధా నంలో సామాన్య ప్రజలు, తల్లిదండ్రులు రాజకీయ నాయకులు అందరూ ఒకే వేదికపైకొచ్చి పాఠశాల అభివృద్ధి తమవంతు సహ కారాన్ని అందించడం జరుగుతుంది. మారుతున్న సాంకేతిక అవస రాలకనుగుణంగా పాఠశాలల్లో ఐసిటి సంబంధిత మౌలికవసతుల కల్పనకు 'కైట్‌ అనే ప్రాజెక్టును రూపకల్పన చేయడం జరిగింది.



వి ద్యారంగంలో అభివృద్ధిపధాన దూసుకుపోతున్న కేరళ రాష్ట్రంవైపు అంతర్జాతీయ సంస్థలు దృష్టిసారిస్తుండగా మనదేశంలోని ఇతర రాష్ట్రాలు కానీ, జాతీయ విద్యాసంస్థలు కానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం దురదృష్టకరం


ఇటీవల నీతి ఆయోగ్‌ విడుదల చేసిన పాఠశాల విద్యానాణ్యత సూచికలలో కేరళ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ పాఠశా లల ర్యాంకింగ్‌లో (2019-20) కేరళలోని నాలుగు ప్రభుత్వ పాఠ శాలలు, మూడు రెసిడెన్షియల్‌ పాఠశాలలు మొదటి పదిస్థానాల్లో నిలవటం దేశానికే గర్వకారణం. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి, పాఠశాల ప్రగతి,భద్రత,శుభ్రత వంటి 14 పరామితుల ఆధారంగా అంతర్జాతీయ పాఠశాల ర్యాం కింగ్‌లు ఇవ్వటంజరిగింది.ఇటీవల జాతీయఅక్షరాస్యత దినోత్సవాల సందర్భంగా జాతీయ అక్షరాస్యత సాధన సంస్థ కేరళ రాష్ట్ర అక్షరా స్యత సంస్థను నమూనాగా తీసుకుని పనిచేయాలని నీతి ఆయోగ్‌ సూచించడం ఆ రాష్ట్రానికే గర్వకారణం. కేవలం అక్షరాస్యతలోనే కాదు ఆడపిల్లల చదువ్ఞలోకూడా కేరళ దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా ముందుంది. 1991లోనే సంపూర్ణ అక్షరాస్యతకల రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం దేశంలో ఏవిధంగా చూసినా విద్యాభి వృద్ధిసూచికలో కేరళ ప్రథమస్థానంలో ఉంది. ఇది ఎలా సాధ్యమ య్యిందో విద్యారంగంలోని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉంది. ఆధునిక పాఠశాల విద్యలో కేరళ రాష్ట్రానికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. కేరళలోని అనేక పాఠశాలలు ప్రారంభించి నూరు సంవత్సరాలు దాటిపోయింది. మొదటి నుండి కేరళలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా విద్యారంగంలో సమూల మార్పులకు చేయూతనందిస్తూనే వస్తున్నాయి. కేవలం పాఠశాలల్లో మౌలికవసతుల అభివృద్ధిపైనే కాకుండా బోధన-అభ్యా సన, నాణ్యమైన బోధన ఐసిటి ఆధారిత బోధన, స్మార్ట్‌ తరగతుల వంటివాటిపై కూడా ప్రత్యేక శ్రద్ధకనబరుస్తున్నాయి. ఇప్పటికే కేరళలో వెయ్యికిపైగా ప్రభుత్వపాఠశాలలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దటమే కాక విద్యార్థులను మారుతున్న ప్రపంచానికి తగ్గట్లు తీర్చిదిద్దడానికి విద్యారంగానికి అత్యధికంగా నిధులు కేటాయి స్తోంది.ప్రతిఏటా విద్యాహక్కు చట్టంప్రకారం బీద విద్యార్థులకుఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తోంది. ఫీజురీయింబర్స్‌మెంట్‌లోమొట్టమొదట ప్రభుత్వపాఠశాలలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వపాఠశాలలోని సీట్లు నిండిన తర్వాత ఎయిడ్‌ పాఠశాలలకు అవి కూడా నిండిన తర్వాత మాత్రమే ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిన పేదవిద్యార్థులకు రిక్రూట్‌మెం ట్‌ జరుపుతోంది. ఈ చర్యవల్ల కేరళలోని ప్రభుత్వపాఠశాలల్లోని సీట్లన్నీ నూరుశాతం నిండుతున్నాయి.ఆంధ్రరాష్ట్రంలో 'అమ్మఒడి కార్యక్రమం ఇటువంటిదే. అయిన ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేట్‌ పాఠశాలలకు కూడా ఈ పథకం అమలు చేయడం వల్ల ముందు ప్రభుత్వపాఠశాలల మనుగడపై నీలినీడలుకమ్ముకొన్నాయి. తరగతిగదుల్లో బోధన,అభ్యాసన పద్ధతులను కేరళలోని పాఠశా లలు పునర్విచిస్తున్నాయి.అందుబాటులో ఉన్న వనరులు, కళాకారు లు, కళాకృతులను ఆధారంగా చేసుకొని 'జనకీయ విద్యాభ్యాస మాతృక అనే విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ విధా నంలో సామాన్య ప్రజలు, తల్లిదండ్రులు రాజకీయ నాయకులు అందరూ ఒకే వేదికపైకొచ్చి పాఠశాల అభివృద్ధి తమవంతు సహ కారాన్ని అందించడం జరుగుతుంది. మారుతున్న సాంకేతిక అవస రాలకనుగుణంగా పాఠశాలల్లో ఐసిటి సంబంధిత మౌలికవసతుల కల్పనకు 'కైట్‌ అనే ప్రాజెక్టును రూపకల్పన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని 45వేల తరగతి గదులను స్మార్ట్‌ తరగతి గదులుగా మార్చడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు ఐసిటి విధానంలో బోధన చేయడానికిఅవసరమైన అన్నిరకాల వనరులు(ఆన్‌లైన్‌ పాఠాలు,వీడియోలు,క్విజ్‌లు) సమగ్ర అనే పోర్టల్‌ ద్వారా కేరళరాష్ట్ర పాఠశాల విద్యాశాఖఅందుబాటులోకి తీసుకువచ్చింది. సమగ్రలో వేయికిపైబడి డిజిటల్‌ పాఠ్యాంశాలు, వీడియోలు, మోడల్‌ ప్రశ్నాపత్రాలు వంటి ఇ-వనరుల్ని ఎవ్వరైనా ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఇప్పటికే వీటి వినియోగంపై లక్షకుపైగా ఉపాధ్యాయులకు శిక్షణనివ్వటం జరిగింది.

లిటిల్‌కైట్స్‌ అనే ఐటి హాబిక్లబ్బులను ప్రతి పాఠశాలల్లో ప్రారంభించి పాఠశాల విద్యార్థులకు యానిమేషన్‌,షార్ట్‌ఫలిమ్స్‌,సైబర్‌ భద్రత,వంటి అనేక అంశాల్లో వీరికిఅవగాహన కల్పిస్తూ చిన్నచిన్నప్రాజెక్టులకు రూప కల్పన చేయిస్తోంది.ఈ ఐటిక్లబ్‌లు భవిష్యత్తులో ఇంక్యుబేటర్లుగా రూపాంతరంచెంది పెద్దపెద్ద ఐటిప్రాజెక్టుల అభివృద్ధికి దోహదపడు తున్నాయి.ఇటువంటి అభివృద్ధికారకమైన చర్యలు చేపట్టడంతో గత 25 సంవత్సరాలలో ఎన్నడూలేనన్ని పాఠశాలప్రవేశాలు ఈ ఏడాది జరిగాయి. 2017-18లో నలభైవేలమంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే, 2018-19సంవత్సరంలో ఈ సంఖ్య 1.8లక్షలకు చేరుకుంది.కేవలంప్రవేశాలపైనేదృష్టిపెట్టకుండా నాణ్యత విషయంలో కూడాపాఠశాలలను అభివృద్ధి చేయడానికి ప్రిజమ్‌ అనే పథకాన్ని ప్రారంభించింది. 20 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠ శాలలను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లటమేకాక కోజికోడ్‌లోని ఐఐఎమ్‌ ద్వారా ఆ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు శిక్షణనివ్వటం వల్లవందల మంది బీదపిల్లలకు అంతర్జాతీయస్థాయి విద్య అందు బాటులోకి వచ్చింది.

మనరాష్ట్రంలో ఒక పేదవిద్యార్థికి అంతర్జాతీయ స్థాయి విద్య ఉచితంగా దక్కుతుందా? అంటే ఎటువంటి సంకోచం లేకుండా లేదనేచెప్పాలి. రాష్ట్రంలో అంతర్జాతీయస్థాయిపాఠశాలలు లేవా?అంటే ఉన్నాయి.కానీ అవన్నీ ప్రైవేట్‌ వ్యక్తులచేతుల్లో వ్యాపా రాత్మక ధోరణితో నడుస్తున్నాయి.రాష్ట్రంలో మోడల్‌స్కూళ్ల పేరుతో కొన్ని పాఠశాలలు నిర్వహిస్తున్నా వాటి పనితీరు మాత్రం ఆశించి నంతమేర లేదన్నదివాస్తవం. కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసు కొని జిల్లాకో అంతర్జాతీయస్థాయి పాఠశాలను ఏర్పాటు చేయాలి.

  • అలేఖ్య

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కేరళ విద్యావిధానం దేశానికే ఆదర్శం"

Post a Comment