ఆరోగ్య శ్రీకి నెలకు రూ. 100 కోట్లు

ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్‌ఎస్) అమలుకు ప్రతి నెలా రూ. 100 కోట్ల మేరకు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వైద్య ఆరోగ్యశాఖ చేసిన విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, ఉద్యోగుల ఆరోగ్య పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది బడ్జెట్‌లో రూ.699.44 కోట్లు కేటాయించగా ఈసారి ఆ మొత్తాన్ని భారీగా పెంచింది. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌కు రూ.1,336 కోట్లు కేటాయించింది. గతేడాదికన్నా ఈసారి రూ.636.56 కోట్లు పెంచింది.ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు రూ. 400 కోట్ల వరకు బకాయిలు పడిన సంగతి తెలిసిందే. వీటికి తోడు ప్రతినెలా బకాయిలు పెరిగిపోతున్నాయి


దీంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. బకాయిలు పేరుకుపోవడం, మరోవైపు రెగ్యులర్‌గా ఇవ్వాల్సినవి ఇవ్వకపోవడంతో సమస్యగా మారింది. ఇటీవల కాలంలో పలుమార్లు ఆసుపత్రులు ఆందోళనలు నిర్వహించడం తెలిసిందే. కొంత ఆలస్యమైనా ప్రభుత్వం చెల్లించుకుంటూ పోతుంది.

అయినా ప్రభుత్వంపై అపవాదులు తప్పటంలేదు. దీంతో ఆరోగ్యశ్రీకి ఎలాగైనా ప్రతి నెలా కొంత సొమ్ము విడుదల చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల విన్నవించింది. ఆ రకంగా క్రమంగా బకాయిలను పూర్తిచేయటంతో పాటు, చెల్లింపులను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.దీంతో పాటు కేసీఆర్ కిట్ కింద లబ్దిదారులకు ఇచ్చే ప్రోత్సాహకం, బాలింతలకు, శిశువులకు ఇచ్చే కిట్లకు కూడా నిధుల సమస్య ఏర్పడింది. వీటికి నెలకు రూ.

30 కోట్ల మేర ఖర్చు అవుతుంది. ఆ సొమ్మును కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదని సర్కారు హామీ ఇచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వీటికే కాకుండా 108 అత్యవసర వాహన సర్వీసులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా నిలిపివేయకూడదని నిర్ణయించారు. దీంతో రాష్టంలో వైద్య ఆరోగ్య సేవలు మరింత మెరుగయ్యే అవకాశముందని పలువురు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆరోగ్య శ్రీకి నెలకు రూ. 100 కోట్లు"

Post a Comment